”ట్రాఫిక్ రూల్స్ పాటించనివారు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు”.. వైరల్ అవుతున్న సైబరాబాద్ పోలీస్ ట్వీట్ ..

|

Feb 08, 2021 | 3:48 PM

Cyberabad Police Tweet: వాహనదారుల తీరు మారట్లేదు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడుపుతున్నారు...

ట్రాఫిక్ రూల్స్ పాటించనివారు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు.. వైరల్ అవుతున్న సైబరాబాద్ పోలీస్ ట్వీట్ ..
Follow us on

Cyberabad Police Tweet: వాహనదారుల తీరు మారట్లేదు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడుపుతున్నారు. యువత అయితే ట్రిపుల్‌ రైడింగ్‌తో రయ్‌..మంటూ దూసుకెళ్తున్నారు. సిగ్నల్స్‌ జంప్‌ చేసే క్రమంలో వెహికిల్‌ నెంబర్‌ కనిపించకుండా వినూత్న రీతిలో తప్పించుకు తిరుగుతున్నారు. ఇక అలాంటివారికి ట్వీట్ల రూపంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు.

సినిమా డైలాగులు, వెరైటీ మీమ్స్‌తో యువతకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కొంతమంది మహిళలు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాన్ని నడుపుతూ కెమెరాకు చిక్కగా.. వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్‌ పాపులర్‌ డైలాగ్‌తో ట్వీట్ చేశారు.

వాళ్లకి సూచన ఇచ్చినట్టుగానే ఇస్తూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగించిన ఈ ఫార్మూలాపై నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భలే ఫన్నీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

India Vs England 1st Test Day 4: రసవత్తరంగా మారిన తొలి టెస్టు.. నాలుగో రోజు పైచేయి సాధించేది ఎవరు.?