వీణా-వాణిల 10వ తరగతి ఎగ్జామ్స్‌పై సస్పెన్స్..

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:48 PM

అవిభక్త కవలలు వీణా-వాణిలకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో ఇరువురికి వేర్వేరుగా హాల్ టికెట్లు ఇవ్వాలా? తలలు కలిసి ఉండటం చేత ఒక్కటే ఇస్తే సరిపోతుందా అనే అంశంపై బోర్డు అధికారులు అయోమయంలో ఉన్నారు.Conjoined twins

వీణా-వాణిల 10వ తరగతి ఎగ్జామ్స్‌పై సస్పెన్స్..
Follow us on

అవిభక్త కవలలు వీణా-వాణిలకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో ఇరువురికి వేర్వేరుగా హాల్ టికెట్లు ఇవ్వాలా? తలలు కలిసి ఉండటం చేత ఒక్కటే ఇస్తే సరిపోతుందా అనే అంశంపై బోర్డు అధికారులు అయోమయంలో ఉన్నారు. గత నాలుగు నెలలుగా దీనిపై చర్చలు జరుపుతున్నా, అందరూ ఒకే నిర్ణయానికి రావడం సాధ్యపడటం లేదు. ఒకవైపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు టైమ్ దగ్గరపడుతోంది. మరో 27 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కాబోతుండగా, 5 రోజుల్లో హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. దీంతో వీణా-వాణిల పేరెంట్స్‌తో పాటు కవలలకు అడ్మిషన్లు ఇచ్చిన స్కూల్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన నెలకుంది.

అందరిలా బతకాలని..అందరిలా తిరగాలనీ వీరిద్దరి ఆశ…కానీ ఆ ఆశ నెరవేర్చేందుకు ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి….వారిని పర్యవేక్షించే వైద్యులూ శ్రమిస్తున్నారు. ఇప్పుడు చదవాలన్నా వీరికి పెద్ద పరీక్షగా మారింది. 12 ఏళ్ల వయస్సులో వీణా-వాణిలు నీలోఫర్ వైద్యశాల నుంచి స్టేట్ హోంకు మారారు. అక్కడ వారు చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టి స్టేట్ హెంలోనే శిక్షణను ఇప్పించింది. ఇక వీణావాణిలను విడదీసి, వారి కష్టాలు తొలగించేందుకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ వైద్యలను సంప్రదించింది తెలంగాణ గవర్నమెంట్. అయితే అతి క్లిష్టమైన సర్జరీ చేయాల్సి ఉంటుందని.. ఆపరేషన్‌కు దాదాపు కోట్లలో ఖర్చు అవుతుందని వైద్య నివేదికలు అందాయి. ఆఫరేషన్ చేయించేందుకు సంసిద్దత చూయిస్తున్నా.. రిస్క్ కూడా ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం ముందుడుగు వేయలేకపోతుంది.  ప్రస్తుతం వీణావాణి పదో పరీక్షలు రాసేందుకు సంసిద్ధులై ఉన్నారు. కానీ హాల్‌టికెట్ల విషయంలో ఇప్పటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది. బర్త్ సర్టిఫికెట్లు వేర్వేరుగా ఇచ్చినప్పడు, హాల్ టికెట్లు కూడా విడివిడిగా ఇచ్చి..పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.