మానవత్వమా! ఏది నీ చిరునామా ? బతికుండగానే తల్లిని కాటికి..

| Edited By: Srinu

Aug 28, 2019 | 3:52 PM

జగిత్యాల జిల్లా కేంద్రంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన చూసిన వారందరికీ మనం ఎక్కడున్నామనే సందేహం కలుగక మానదు..మనుషుల్లో మానవత్వం మాయమవుతుందని చెప్పటానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. వృద్ధాప్యంతో మంచాన పడ్డ కన్న తల్లిని బ్రతికుండగానే స్మశాన వాటికకు చేర్చాడు ఓ కన్నకొడుకు. అది చూసిన స్థానికులు విస్తు పోయారు. తల్లి బ్రతికుండగానే ఎలా స్మశానవాటికలో వేస్తారని అతన్ని నిలదీశారు. అందుకు తాను చెప్పిన సమాధానం..పేదరికం. తాను పేదరికంతో బాధపడుతూ..ఉండేందుకు సొంత ఇల్లు కూడా […]

మానవత్వమా! ఏది నీ చిరునామా ? బతికుండగానే తల్లిని కాటికి..
Follow us on

జగిత్యాల జిల్లా కేంద్రంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన చూసిన వారందరికీ మనం ఎక్కడున్నామనే సందేహం కలుగక మానదు..మనుషుల్లో మానవత్వం మాయమవుతుందని చెప్పటానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం.
వృద్ధాప్యంతో మంచాన పడ్డ కన్న తల్లిని బ్రతికుండగానే స్మశాన వాటికకు చేర్చాడు ఓ కన్నకొడుకు. అది చూసిన స్థానికులు విస్తు పోయారు. తల్లి బ్రతికుండగానే ఎలా స్మశానవాటికలో వేస్తారని అతన్ని నిలదీశారు. అందుకు తాను చెప్పిన సమాధానం..పేదరికం. తాను పేదరికంతో బాధపడుతూ..ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదని చెబుతున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్న కారణంగానే తాను ఇదంతా చేయాల్సి వచ్చిందని అన్నాడు. సొంత ఇళ్లు లేనివారి ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అందుకే తన తల్లి బ్రతికుండగానే ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పాడు. దీంతో విషయం తెలుసుకున్నస్థానిక మున్సిపల్‌ అధికారులు ఆ వృద్దురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఇల్లు లేని తమలాంటి నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.