Road Accident: మరణంలోనూ వీడని స్నేహం.. నలుగురి ప్రాణాలు బలితీసుకున్న అతివేగం..!

| Edited By: Balaraju Goud

Apr 25, 2024 | 8:52 AM

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ద్విచక్ర వాహనం డీ కొట్టిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్షం అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Road Accident: మరణంలోనూ వీడని స్నేహం.. నలుగురి ప్రాణాలు బలితీసుకున్న అతివేగం..!
Bike Accident
Follow us on

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ద్విచక్ర వాహనం డీ కొట్టిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్షం అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో జరిగింది. వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు- వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతులు అంతా ఇల్లంద గ్రామానికి వరుణ్ తేజ, సిద్దు,గణేష్, అనిల్ కుమార్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు మిత్రులు ఒకే ఘటనలో మృతి చెందడంతో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఊరంతా విషాదఛాయలు అలముకున్నాయి.. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..