ట్రామాకేర్‌ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి ఈటల

| Edited By: Srinu

Nov 26, 2019 | 5:30 PM

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. పర్యటనలో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో వసతులను పరిశీలించారు. కమలాపుర్‌ మండలంలోని 30 పడకల ఆస్పత్రిని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం జమ్మికుంటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ట్రామా కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు.. ఈ సందర్భంగా… అక్కడి వైద్య సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. […]

ట్రామాకేర్‌ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి ఈటల
Follow us on

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. పర్యటనలో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో వసతులను పరిశీలించారు. కమలాపుర్‌ మండలంలోని 30 పడకల ఆస్పత్రిని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం జమ్మికుంటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ట్రామా కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు.. ఈ సందర్భంగా… అక్కడి వైద్య సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఐపీ, డెలివరీకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు జమ్మికుంట పెద్ద వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడి వచ్చిపోయే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే హుజురాబాద్‌లో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరిగితే, వరంగల్‌ వరకు వెళ్లే అవసరం లేకుండా ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి ఈటెల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్‌పర్సన్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీహెచ్‌ అండ్‌ హెచ్‌వో, ఇతర సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.