POCSO Court: మహబూబాబాద్‌ జిల్లాలో పోక్సో కోర్టు.. వారిపై జరిగే నేరాలపై ఇక విచారణ వేగవంతం..

|

Feb 14, 2022 | 7:54 AM

న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది. చిన్నారులను చిదిమేసే మృగాళ్లును కఠినంగా శిక్షించేందుకు మహబూబాబాద్‌ జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది న్యాయవ్యవస్థ.

POCSO Court: మహబూబాబాద్‌ జిల్లాలో పోక్సో కోర్టు.. వారిపై జరిగే నేరాలపై ఇక విచారణ వేగవంతం..
Pocso Court
Follow us on

న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది. చిన్నారులను చిదిమేసే మృగాళ్లును కఠినంగా శిక్షించేందుకు మహబూబాబాద్‌ జిల్లాలో(Mahabubabad District) పోక్సో కోర్టు(POCSO Court) ఏర్పాటు చేసింది న్యాయవ్యవస్థ. దేశంలో అభం శుభం తెలియని చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది న్యాయ వ్యవస్థ. ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ తండాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో నిందితులు చాలా కేసుల్లో తప్పించుకుంటున్నారు. ఇలాంటి నేరాలకు చెక్‌ పెట్టి.. ఆదివాసీ తండాలకు అండగా నిలిచేందుకు న్యాయవ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చిన్నారులపై జరిగే నేరాలపై వేగంగా విచారణ జరిపేందుకు మహబూబాబాద్‌ జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటు చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బాధితులు భయం లేకుండా తమపై జరిగిన నేరాలను న్యాయమూర్తికి చెప్పుకునేలా.. సత్వర న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంది.

మహబూబాబాద్‌లో మెజారిటీ శాతం ప్రజలు గిరిజనులే. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కూడా ఎస్టీలకే రిజర్వ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న కోర్టులో మహబూబాబాద్‌ పోక్సో కోర్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. అత్యాధునిక సదుపాయాలు ఈ కోర్టులో ఉన్నాయి. బాధితుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు.

బాధితులు భయపడే పరిస్థితి లేకుండా కోర్టులో ఆహ్లాదకరమైన వాతారణాన్ని ఏర్పాటుచేశారు. కార్పొరేట్‌ స్కూల్‌లా కోర్టు కన్పిస్తుంది. బాధితులు , వాళ్ల బంధువులు కూర్చేనేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌తో కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించారు.

పిల్లలపై అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పోక్సో కోర్టుకు ఏర్పాటు చేసింది. ఎక్కడో మారుమూల ప్రాంతమైన మహబూబాబాద్‌లో ఇలాంటి పోక్సో కోర్టు ఏర్పాటుపై అభినందనలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..