ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమంలో రాజీపడలేదుః హరీష్‌రావు

|

Sep 23, 2019 | 7:17 PM

ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమంలో రాజీపడలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరిష్‌రావు పాల్గొన్నారు. గజ్వెల్‌ పట్టణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..లోటు బడ్జెట్‌ ఉన్నా పథకాలకు కోత పెట్టలేదన్నారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మీ పథకాలు యధావిధిగా సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ గానీ, టీడీపీ గానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇంటింటికి నీళ్లొచ్చేవా? అని […]

ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమంలో రాజీపడలేదుః హరీష్‌రావు
Follow us on
ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమంలో రాజీపడలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరిష్‌రావు పాల్గొన్నారు. గజ్వెల్‌ పట్టణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..లోటు బడ్జెట్‌ ఉన్నా పథకాలకు కోత పెట్టలేదన్నారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మీ పథకాలు యధావిధిగా సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ గానీ, టీడీపీ గానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇంటింటికి నీళ్లొచ్చేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎప్పుడైనా బతుకమ్మ చీరలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుతో పాటుగా ఎంపీ కొత్త ప్రభాకర్, స్థానిక టీఆర్ఎస్‌ నేతలు పాల్గొన్నారు.