ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మాయం

|

Nov 26, 2019 | 8:06 PM

తెలుగు రాష్ట్రాల్లో పసిపిల్లల కిడ్నాప్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. డబ్బులపై ఆశ, కుటుంబ తగాదాలు, పాత కక్షల కారణంగా ఏ పాపం తెలియని చిన్నారులు పావులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని పసివాళ్లను ఎత్తుకెళ్తున్న కిడ్నాపర్లు కొన్ని సందర్భాల్లో అన్యాయంగా వారిని పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు కూడా అనేక సందర్భాల్లో ముక్కుపచ్చలారని పసికందులే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలం సీటీఎంలో ఈ నెల 22న అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు అశోక్‌ ఆచూకీ […]

ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మాయం
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో పసిపిల్లల కిడ్నాప్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. డబ్బులపై ఆశ, కుటుంబ తగాదాలు, పాత కక్షల కారణంగా ఏ పాపం తెలియని చిన్నారులు పావులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని పసివాళ్లను ఎత్తుకెళ్తున్న కిడ్నాపర్లు కొన్ని సందర్భాల్లో అన్యాయంగా వారిని పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు కూడా అనేక సందర్భాల్లో ముక్కుపచ్చలారని పసికందులే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలం సీటీఎంలో ఈ నెల 22న అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు అశోక్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న అశోక్‌ను శాంతమ్మ అనే మహిళ ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీ పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. బాలున్ని ఎత్తుకెళ్లిన శాంతమ్మ ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మరో పసికందు కనిపించకుండా పోయింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పసిపాపను ఓ మహిళ అపహరించింది. 15 రోజుల క్రితం పుట్టిన పాపకు పాలు పట్టిస్తానంటూ ఓ మహిళ మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. పాపను ఓ మహిళ ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. సదరు మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.