Telangana: ‘మనిషి మాయమవ్వడం అంటే ఇదేనేమో’.. తల్లి అంత్యక్రియ ఖర్చుల కోసం..

|

Aug 30, 2024 | 1:21 PM

వివరాల్లోకి వెళితే.. కామరెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన చామకూర శంకర్‌ (60), మాధవ్‌ (56) అన్నదమ్ములు. వీరి తల్లి నర్సవ్వ (92) ఈ నెల 19న అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలకు అయిన ఖర్చు కోసం స్థానికంగా ఉన్న వారి దగ్గర రూ. 40 వేల అప్పు చేశారు. ఇక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అప్పుగా తెచ్చిన ఆ డుబ్బును ఎవరు చెల్లించాలన్న దానిపై వాదన మొదలైంది...

Telangana: మనిషి మాయమవ్వడం అంటే ఇదేనేమో.. తల్లి అంత్యక్రియ ఖర్చుల కోసం..
Telagnana
Follow us on

‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’.. అందెశ్రీ రాసిన ఈ పాట మనిషి కదిలిస్తుంది. మనిషిలోని మానవత్వం అగ్నిలో కొవ్వెత్తిలా కరిగిపోతుందని గుర్తు చేస్తుందీ పాట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నాడు. ప్రస్తుత తరుణంలో మానవత్వం, బంధుత్వాలకు విలువలు తగ్గిపోతున్నాయి. బుధవారం కామారెడ్డిలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే మనిషిలో తగ్గిపోతున్న మానవత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. తల్లి అంత్యక్రియలకు అయిన ఖర్చు కోసం ఇద్దరు తోడబుట్టిన సోదరులు రాళ్లతో కొట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కామరెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన చామకూర శంకర్‌ (60), మాధవ్‌ (56) అన్నదమ్ములు. వీరి తల్లి నర్సవ్వ (92) ఈ నెల 19న అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలకు అయిన ఖర్చు కోసం స్థానికంగా ఉన్న వారి దగ్గర రూ. 40 వేల అప్పు చేశారు. ఇక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అప్పుగా తెచ్చిన ఆ డుబ్బును ఎవరు చెల్లించాలన్న దానిపై వాదన మొదలైంది.

తల్లి దాచుకున్న పింఛన్‌ డబ్బును మాధవ్‌ తీసుకున్నాడని. ఆ అప్పును తనే చెల్లించాలని శంకర్‌ వాదించడం మొదలు పెట్టలేదు. దీనికి మాధవ్‌ ససేమిర అన్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయమై పంచాయతీ పెట్టారు. శంకర్‌ తన బంధువులను పిలించాడు. మాట మాట పెరగడం, డబ్బు గురించి చర్చ రావడంతో మాధవ్‌ తాగిన మత్తులో తన అన్న కుమారు బాబులాల్‌తో తీవ్రంగా వాదించారు. ఇదే క్రమంలో బాబులాల్‌ చేతితో నెట్టేయడంతో మాధవ్‌ కిందపడ్డాడు.

దీంతో ఇది కాస్త ఇరు కుటంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. రెండు వైపులా ఉన్నవారు కర్రలు, ఇటుకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో మాధవ్, నాగమణి దంపతుల తలలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి స్పృహ కోల్పోయారు. పరిస్థితి విషయంగా ఉండడంతో నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శంకర్, ఆయన కుమారుడు బాబులాల్, కుమార్తె గంగామణిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరు కుటుంబాల ఫిర్యాదుతో పోలీసుసు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..