Telangana: PFI కు టీఆర్ ఎస్ నిధులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

|

Sep 21, 2022 | 1:04 PM

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ..

Telangana: PFI కు టీఆర్ ఎస్ నిధులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us on

Telangana: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కి TRS నిధులు ఇస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి తెలంగాణ ను ఇస్లాం రాజ్యం గా మార్చడమే అధికార టీఆర్ ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఉగ్రవాద కార్యక్రమాలు PFI అడ్డాగా మారిందని, ఆసంస్థతో టీఆర్ ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. వ్యాయామాల పేరుతో PFI దేశ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ సిమి మరో అవతారమే PFI అని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే PFI కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. NIA దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీని వెనుక భారీ కుట్రలు దాగి ఉన్నాయని NIA తేల్చింది. రెండు రాష్ట్రాల్లో దాడులు చేసిన NIA అధికారులు నలుగురు నిందితులు ఫిరోజ్‌, ఉస్మన్‌, ఇమ్రాన్‌, సమీర్‌లను అరెస్ట్ చేసింది. పీఎఫ్‌ ఐ కార్యకర్తలు అబ్దుల్‌ ఖాదర్‌తో కలిసి ఉగ్ర చర్యలకు కుట్ర చేశారని రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎన్ ఐ ఎ పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..