బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

|

Sep 29, 2020 | 1:30 PM

హైదరాబాద్‌లోని హోటల్‌ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల పంపిణీ, డిజైన్‌లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, టెస్కో ఎండీ శైలజ రామయ్యర్‌, మహిళా సంఘాలు పాల్గొన్నాయి.

బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
Follow us on

హైదరాబాద్‌లోని హోటల్‌ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల పంపిణీ, డిజైన్‌లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, టెస్కో ఎండీ శైలజ రామయ్యర్‌, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. చేనేతకు చేయూతలో భాగంగా సిరిసిల్ల మరమగ్గాలపై తయారు చేసిన ఈ బతుకమ్మ చీరలను విభిన్నమైన డిజైన్‌లలో రూపొందించారు. బంగారు, వెండి జరి అంచులు పెట్టారు.. 317.81 కోట్ల రూపాయల వ్యయంతో కోటికిపైగా చీరలను తయారు చేశారు.. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభించింది. దాదాపు ఇప్పటికే అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరలు చేరాయి.. కొన్ని జిల్లాలలో పంపిణీ కూడా మొదలయ్యింది.. అక్టోబర్‌ రెండోవారంలోగా అందరికీ చీరలు అందెలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది..
తెలంగాణ ఆడపడచుల పండుగైన బతుకమ్మ కోసం మహిళలకు సారె పంపిణీ చేయాలని 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి ఏడాది కోటి చీరలను అందిస్తోంది.. మొదటి సంవత్సరం సమయం సరిపోకపోవడంతో 40 శాతం చీరలను సిరిసిల్లలో తయారు చేయగా, మిగతావి వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు.. ఆ మరుసటి ఏడాది, అంటే 2018లో వంద డిజైన్లలో బంగారు రంగు జరి అంచు ప్లెయిన్‌ చీరలను సిరిసిల్లలోనే తయారు చేశారు. ఈసారి బంగారు, వెండి జరీతో 225 రకాల చీరలు ఉత్పత్తి చేశారు.. బతుకమ్మ చీరల వల్ల 15 వేల మంది నేతన్నలకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్నది.. పరోక్షంగా 20 వేల మందికి బతుకునిస్తున్నది.