మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేటకు మరో రికార్డు.. అందుకోసం తన ఆస్తిని తాకట్టుపెట్టిన ప్రజా నాయకుడు

|

Jan 21, 2021 | 10:39 AM

సిద్దిపేట: వారి నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్లాలంటే రోడ్డుమీద మూడు చక్రాలు తిరగాల్సిందే. ఒక్కరోజు చక్రం ఆగినా వారు పస్తులుండాల్సిందే..

మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేటకు మరో రికార్డు.. అందుకోసం తన ఆస్తిని తాకట్టుపెట్టిన ప్రజా నాయకుడు
Follow us on

సిద్దిపేట: వారి నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్లాలంటే రోడ్డుమీద మూడు చక్రాలు తిరగాల్సిందే. ఒక్కరోజు చక్రం ఆగినా వారు పస్తులుండాల్సిందే. అలాంటి ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముందుకొచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈరోజు సిద్దిపేటలో హరీశ్‌రావు చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు మంత్రి రుణాలు, డ్రెస్సులు అందించనున్నారు. అయితే ఆటో క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసేందుకు తన ఆస్తిని బ్యాం కుకు తాకట్టు పెట్టే సంచలన నిర్ణయం తీసుకున్నారు మంత్రి హరీశ్‌రావు.

వందలాది మంది తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆటోలు నడుపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆటో నడపగా వచ్చిన డబ్బులు రోజువారి ఫైనాన్స్‌ వడ్డీలకే సరిపోవడం లేదు. తమను ఎలాగైనా ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు మంత్రికి మొర పెట్టుకోవడంతో 2019 అక్టోబరులో సొసైటీ ఏర్పాటుకు మంత్రి శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం ఈ సొసైటీలో సభ్యుల సంఖ్య 850కి చేరింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆటో ఆర్‌సీ తదితర అంశాలు అర్హతగా ఎంత మంది వచ్చినా సభ్యులుగా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది. మంత్రి హరీశ్‌రావు సాహసోపేతమైన నిర్ణయంతో ఆటోవాలాలకు ఇప్పుడు సులభంగా రుణాలు దొరుకనున్నాయి.