అక్రమార్కుల గుండెల్లో గుబులు.. పాలమూరులో కదిలిన హైడ్రా తరహా బుల్‌డోజర్..!

| Edited By: Balaraju Goud

Aug 29, 2024 | 9:04 PM

హైడ్రా తరహా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పాలమూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత అర్థరాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

అక్రమార్కుల గుండెల్లో గుబులు.. పాలమూరులో కదిలిన హైడ్రా తరహా బుల్‌డోజర్..!
Mahabubnagar Demolish
Follow us on

హైడ్రా తరహా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పాలమూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత అర్థరాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

క్రిస్టియన్ పల్లికి సమీమలోని సర్వే నంబర్ 523లో సుమారు 70కి పైగా ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ అర్దరాత్రి తర్వాత ఈ కూల్చివేతలు జరిపారు. భారీగా పోలీసులు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది సహకారంతో జేసీబీలతో ఇళ్ళను కూల్చివేశారు. అర్దరాత్రి దాటిన తర్వాత మొదలైన కూల్చివేతలు తెల్లవారుజామున వరకు కొనసాగాయి.

వీడియో చూడండి…

లబోదిబోమంటున్న బాధితులుః

తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ నివాసాలను నేలమట్టం చేశారాంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. ఇళ్లను అకస్మాత్తుగా కూలగొట్టడంతో ఇంట్లోని సామాన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. గతంలో ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి ఇప్పుడు అక్రమ పట్టాలు అని చెబుతున్నారని మండిపడుతున్నారు. సుమారు 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చెబుతున్నారు. కరెంటు బిల్లు, ఓటు హక్కు అన్ని ఇక్కడి నుంచే ఉన్నాయని… ఇళ్ళ క్రమద్ధీకరణకు సైతం దరఖాస్తు చేసుకున్నామని వాపోతున్నారు. రోజువారీ కూలి చేసుకునే తాము పైసా పైసా పోగుచేసి 50-60 గజాలలో ఇల్లు నిర్మించుకుంటే కూలగొట్టరని బాధపడుతున్నారు.

సర్వే నంబర్ 523 లో 83ఎకరాల ప్రభుత్వ భూమిః

వాస్తవంగా సర్వే నంబర్ 523 లో 83ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ ఘాన్సీ రామ్ చెప్పారు. ఇందులో మూడున్నర ఎకరాల్లో కొంతమంది పేదలకు పట్టాలు పంపిణీ జరిగినట్లు వెల్లడించారు. అయితే గత రాత్రి చేపట్టిన కూల్చివేతల్లో ఏ ఒక్కరికీ కూడా పట్టాలు లేవని స్పష్టం చేశారు. ఒకటికి మూడు సార్లు చెక్ చేసిన తర్వాతే కూల్చివేతలు చేపట్టామని వెల్లడించారు. అక్రమ పట్టాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని దానిపైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూమిలో ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లోనూ ఇదే రకంగా వ్యవహరిస్తామని తహసిల్దార్ ఘాన్సీ రామ్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..