WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఫీచర్ మామూలుగా లేదుగా..

|

Sep 09, 2024 | 6:47 PM

కొంత మంది బీటా టెస్టర్లకు కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. చాట్‌లను త్వరగా గుర్తించడంలో సహాయపడే ఈ ఫీచర్ అసంపూర్తి సందేశాలు,  పంపని సందేశాలను నేరుగా చాట్ లిస్ట్‌లో హైలైట్ చేస్తుంది. వాటిని ఒక్క చూపులో గుర్తించడం చాలా సులభం అవుతుంది. వాటిని వెంటనే మళ్లీ రీసెండ్ చేసే అవకాశం ఉంటుంది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఫీచర్ మామూలుగా లేదుగా..
Whatsapp
Follow us on

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అనేక ఫీచర్లను పరిచయం చేస్తోంది. తద్వారా యూజర్లు మరింత సౌకర్యం, సౌలభ్యం పొందేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కు ఎంతో ఆదరణ ఉంది. అనేక మంది ఈ యాప్ ద్వారా నిరంతరం అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. డ్రాఫ్ట్ మెసేజ్ అని పిలిచే ఈ ఫీచర్ తో చాట్ లిస్ట్ లోని అసంపూర్తిగా ఉన్న మెసేజ్‌లను నేరుగా గుర్తించవచ్చు.

డ్రాఫ్ట్ మెసేజ్ ఫీచర్..

డ్రాఫ్ట్ మెసేజ్ ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో దాని ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్‌ను పరిచయం కానుంది. చాట్ లిస్ట్ లోని అసంపూర్తిగా ఉన్న మెసేజ్‌లను దీని ద్వారా సులవుగా గుర్తించవచ్చు. దాని ద్వారా వినియోగదారుడికి మెసేజ్ ల నిర్వహణ సులభమవుతుంది. పంపని సందేశాలను కొత్త డ్రాఫ్ట్ లెబెల్ హైలైట్ చేస్తుంది. ప్రతి మెసేజ్ ను తెరవకుండానే వాటిని గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. తద్వారా ముఖ్యమైన కమ్యూనికేషన్లను కోల్పోయే ప్రమాదం ఉండదు.

గుర్తించడం సులువు..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్లకు కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. చాట్‌లను త్వరగా గుర్తించడంలో సహాయపడే ఈ ఫీచర్ అసంపూర్తి సందేశాలు,  పంపని సందేశాలను నేరుగా చాట్ లిస్ట్‌లో హైలైట్ చేస్తుంది. వాటిని ఒక్క చూపులో గుర్తించడం చాలా సులభం అవుతుంది. వాటిని వెంటనే మళ్లీ రీసెండ్ చేసే అవకాశం ఉంటుంది.

గతంలో..

గతంలో మెసేజ్ అసంపూర్తిగా మిగిలిపోయిందో లేదో చెప్పడానికి స్పష్టమైన మార్గం ఉండేది కాదు. ప్రతి సంభాషణను మాన్యువల్‌గా తనిఖీ చేయాల్సి వచ్చేది. కొత్త డ్రాఫ్ట్ లేబుల్‌తో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి సంభాషణను తెరవాల్సిన అవసరం లేకుండానే పంపని సందేశాలను గుర్తించవచ్చు.

ఉపయోగాలు ఇవే..

ముఖ్యమైన సందేశాలు మన ఆత్మీయులు, స్నేహితులకు పంపడానికి ఈ ఫీచర్ మనకు సహాయ పడుతుంది. పంపని సందేశాలను మరచిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ చాట్లు యూజర్ల డ్రాఫ్ట్ కార్యాచరణ ఆధారంగా సంభాషణల జాబితాలో పైకిస్థానంలో ఉంటాయి. వాట్సాప్ తన వినియోగదారుల మెసేజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. కొత్త ఫీచర్ తో యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..