Spam call: స్పామ్ కాల్స్ చికాకు పెడుతున్నాయా.. జస్ట్ ఈ టిప్స్ పాటించండి.. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు..

|

Aug 01, 2024 | 5:24 PM

ఎందుకంటే అన్‌నోన్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఉండలేం. అవి మనకు తెలిసిన వారివి అవి ఉంటాయని భావిస్తాం. స్పామ్ కాల్స్ వల్ల కొన్నిసార్లు మోసాలకు కూడా గురవుతాం. టెలిమార్కెటర్లు, రోబోకాలర్లు, స్కామర్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం..

Spam call: స్పామ్ కాల్స్ చికాకు పెడుతున్నాయా.. జస్ట్ ఈ టిప్స్ పాటించండి.. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు..
Spam Calls
Follow us on

అర్జెంట్ పనిమీద బైక్ పై వెళుతుంటాం. మన మొబైల్‌కి అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే బండిని రోడ్డు పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేస్తే అది మార్కెటింగ్ కాల్. తమ ఉత్పత్తులు కొనండనో, క్రెడిట్ కార్డు తీసుకోవాలనో అడుగుతారు. అలాగే భోజనం చేస్తున్నప్పుడో, విశ్రాంతి తీసుకుంటున్నాప్పుడో, బంధువులతో ఉన్నప్పుడో ఇలాంటి కాల్స్ రావడం అందరికీ తెలిసిందే. వీటినే స్పామ్ కాల్స్ అంటారు. ఇవి మనకు ఎంతో చికాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా మన పనులకు అంతరాయం కలిగిస్తాయి. ఎందుకంటే అన్‌నోన్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఉండలేం. అవి మనకు తెలిసిన వారివి అవి ఉంటాయని భావిస్తాం. స్పామ్ కాల్స్ వల్ల కొన్నిసార్లు మోసాలకు కూడా గురవుతాం. టెలిమార్కెటర్లు, రోబోకాలర్లు, స్కామర్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే మనకు ఉపయోగపడే అన్‌నోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కింద తెలిపిన విధానాలు మీకు చాలా ఉపయోగపడతాయి.

ఎన్సీపీఆర్ రిజిస్ట్రేషన్..

నేషనల్ డూ నాట్ కాల్ రిజిస్ట్రీ (ఎన్డీఎన్సీ)గా పిలువబడే నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (ఎన్సీపీఆర్)తో మీ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయడానికి అత్యంత ఉత్తమమైన మార్గం ఇదే. టెలిమార్కెటింగ్ కాల్స్ ను నిరోధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

డీఎన్‌డీ సర్వీస్..

స్పామ్ కాల్స్ చికాకులను తప్పించుకోవడానికి టెలికాం కంపెనీలు వినియోగదారులకు డీఎన్ డీ సర్వీస్ అందిస్తున్నాయి. దీనిని యాక్టివేట్ చేసుకునే విధానం..

  • ఫోన్ లో ఎస్ఎమ్ఎస్ ను తెరచి “START” అని టైప్ చేసి 1909కి పంపండి.
  •  అనంతరం మీకు బ్యాంకింగ్, హాస్పిటాలిటీ మొదలైన కేటగిరీల జాబితా వస్తుంది. వాటిలో ఒక్కోదానికీ ఒక్కో కోడ్ ఉంటుంది.
  •  మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కాల్స్ కు సంబంధించిన కోడ్ ను ఎంటర్ చేయండి.
  •  అనంతరం మీరు కన్ఫామ్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఈ సర్వీస్ 24 గంటల పాటు ఉంటుంది. దీనివల్ల మనకు బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. మూడవ పక్షాల నుంచి అయాచిత వాణిజ్య కాల్స్ బ్లాక్ అవుతాయి.

టెలికాం ఆపరేటర్ల ద్వారా..

  • టెలికాం ఆపరేటర్ల ద్వారా కూడా డీఎన్ డీ సేవలను నేరుగా పొందవచ్చు. DND సేవను యాక్టివేట్ చేయండి.
  •  జియో వినియోగదారులు మైజియో యాప్ లోకి వెళ్లండి. సెట్టింగ్స్ లోని సర్వీస్ సెట్టింగ్‌ కు వెళ్లండి. అనంతరం డోన్ట్ డిస్ట్రబ్ ఎంపిక చేసుకోండి. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వర్గాలను ఎంచుకోండి.
  •  ఎయిర్ టెల్ వినియోగదారులు వెబ్ సైట్ ని సందర్శించండి. మీ మొబైల్ నంబర్, ఓటీపీని నమోదు చేయండి, ఆపై మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వర్గాలను ఎంచుకోండి.
  •  వోడాఫోన్ ఐడియాకు సంబంధించి వెబ్ సైట్ లోకి వెళ్లండి. మీ వివరాలను నమోదు చేయండి మరియు బ్లాక్ చేయడానికి వర్గాలను ఎంచుకోండి.
  •  బీఎస్ఎన్ఎల్ నంబర్ నుంచి 1909కి “start dnd” అని పంపండి, ఆపై మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వర్గాలను ఎంచుకోండి.

మాన్యువల్ గా బ్లాక్ చేసే విధానం..

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు స్పామ్ కాల్స్ ను మాన్యువల్‌గా బ్లాక్ చేసే అవకాశం ఉంది.

  •  ఫోన్ యాప్‌ని తెరిచి, కాల్ హిస్టరీకి వెళ్లండి.
  •  స్పామ్ కాంటాక్ట్ ను నొక్కి పట్టుకోండి, ఆపై “బ్లాక్” లేదా “రిపోర్ట్” ఎంచుకోండి.
  •  ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది కానీ స్పామ్ కాలర్లు తరచుగా నంబర్లను మారుస్తుంటారు. కాబట్టి వేరే నంబర్ నుంచి కాల్స్ వచ్చే అవకాశం ఉంది.

ఫిల్టర్ అన్‌నోన్ కాల్స్..

అన్‌నోన్, అనుమానిత స్పామ్ కాల్స్ ను ఆటోమేటిక్ ఫిల్టర్ చేసే ఫీచర్ ను ఆండ్రాయిడ్ ఫోన్లు అందజేస్తున్నాయి. దానికి యాక్టివేట్ చేసుకోవాలంటే..

  •  ముందుగా ఫోన్ యాప్‌ను తెరవండి.
  •  మూడు చుక్కల (మెనూ) చిహ్నాన్ని నొక్కండి, అనంతరం సెట్టింగ్‌లకు వెళ్లండి.
  •  “కాలర్ ఐడీ అండ్ స్పామ్”ని ఎంచుకుని, “స్పామ్ కాల్‌లను ఫిల్టర్ చేయి”, అలాగే “కాలర్ అండ్ స్పామ్ ఐడీని చూడండి”పై టోగుల్ చేయండి.
  •  ఈ ఫీచర్ మీ కాంటాక్ట్‌లలో లేని నంబర్‌ల నుంచి కాల్స్ ను నిశ్శబ్దం చేయడంలో సహాయపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..