మార్స్ గ్రహంపై ఏలియన్స్ ఆనవాలు

| Edited By: Ram Naramaneni

Mar 07, 2019 | 11:51 AM

మార్స్ గ్రహంపై ఏలియన్ ఆనవాలును శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్ ఎక్స్‌ప్రెస్ అనే ఉపగ్రహం ద్వారా ఈ సమాచారాన్ని వాళ్లు సేకరించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని ద్వారా మార్స్‌ గ్రహం లోలోపల ఒకప్పుడు నీరు భారీగా ఉండిందనడానికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు పట్టుకోగలిగారు. నీటి ఆనవాళ్లు అంటే నదులు, సరస్సులు, లోయలు.. ఇలా పలు నీటి వనరులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఆ నీటి వనరులు 3.5 బిలియన్ సంవత్సారాల క్రితం […]

మార్స్ గ్రహంపై ఏలియన్స్ ఆనవాలు
Follow us on

మార్స్ గ్రహంపై ఏలియన్ ఆనవాలును శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్ ఎక్స్‌ప్రెస్ అనే ఉపగ్రహం ద్వారా ఈ సమాచారాన్ని వాళ్లు సేకరించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని ద్వారా మార్స్‌ గ్రహం లోలోపల ఒకప్పుడు నీరు భారీగా ఉండిందనడానికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు పట్టుకోగలిగారు.

నీటి ఆనవాళ్లు అంటే నదులు, సరస్సులు, లోయలు.. ఇలా పలు నీటి వనరులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఆ నీటి వనరులు 3.5 బిలియన్ సంవత్సారాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

మొదటిగా మార్స్ గ్రహం నీటి వనరుగానే ఉండేదట. భూగర్భ జలాలు కూడా అధికంగా ఉండేవట. అయితే కాలం గడిచిన కొద్దీ వాతావరణ మార్పుల వల్ల నీరు పోయి ఇప్పుడు ఉన్న పరిస్థితికి వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనిని బట్టి జీవరాశులు కూడా కచ్చితంగా ఉండి ఉంటాయనడానికి బలమైన ఆధారం లభించినట్లైంది. నీటి ఆనవాళ్లు మాత్రమే కాదు మట్టి, కార్బొనేట్స్, సిలికేట్స్ వంటివి కూడా ఉన్నట్టు గుర్తించడం వల్ల ఏలియన్స్ ఒకప్పుడు మార్స్‌పై ఉండేవారని శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకొచ్చారు.