సిద్దిపేట రిజర్వాయర్‌కు పగుళ్లు..కలకలం రేపుతోన్న లీకులు

|

Oct 23, 2019 | 5:00 PM

సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక్ సాగర్ (ఆర్‌ఎన్‌ఎస్) రిజర్వాయర్ నుంచి మంగళవారం ఉదయం జరిగిన  లీక్‌లు కలకలం సృష్టించాయి. ఆర్‌ఎన్‌ఎస్.. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) లో భాగమన్న సంగతి తెలిసిందే. మిడ్ మానేర్ ఆనకట్ట నుండి ప్రవాహాలు రాకపోవడంతో.. జలాశయంలోని నీరు అడుగంటిపోయింది. అయినప్పటికీ, బండ్ నిర్మాణంలో నాణ్యత తక్కువగా ఉన్నందున లీక్‌లు కనిపిస్తున్నాయి. ఒక నెల క్రితం, గాయత్రి పంప్ హౌస్ వద్ద మూడవ హెవీ డ్యూటీ మోటారు పంప్-సెట్ నుండి […]

సిద్దిపేట రిజర్వాయర్‌కు పగుళ్లు..కలకలం రేపుతోన్న లీకులు
Follow us on

సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక్ సాగర్ (ఆర్‌ఎన్‌ఎస్) రిజర్వాయర్ నుంచి మంగళవారం ఉదయం జరిగిన  లీక్‌లు కలకలం సృష్టించాయి. ఆర్‌ఎన్‌ఎస్.. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) లో భాగమన్న సంగతి తెలిసిందే. మిడ్ మానేర్ ఆనకట్ట నుండి ప్రవాహాలు రాకపోవడంతో.. జలాశయంలోని నీరు అడుగంటిపోయింది. అయినప్పటికీ, బండ్ నిర్మాణంలో నాణ్యత తక్కువగా ఉన్నందున లీక్‌లు కనిపిస్తున్నాయి.

ఒక నెల క్రితం, గాయత్రి పంప్ హౌస్ వద్ద మూడవ హెవీ డ్యూటీ మోటారు పంప్-సెట్ నుండి నీటిని విడుదల చేసి.. ట్రైల్ రన్ నిర్వహించినప్పుడు, స్లాబ్ కూలిపోయింది. కొన్ని రోజుల క్రిందట మిడ్ మానేర్ ఆనకట్ట నుంచీ నీటి లీకేజీ జరిగిన దాఖలాలు కనిపించాయి. అత్యంత ప్రస్టేజియస్‌గా భావించిన ఈ రిజర్వాయర్ నాణ్యతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 సిద్దిపేట జిల్లాలోని చిన్నకోదూర్ మండలంలోని చంద్లాపూర్‌లో ఉన్న ఈ రిజర్వాయర్‌ను 2,176 ఎకరాల భూమిలో, కెఎల్‌ఐఎస్ కింద 463 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీని ద్వారా 3 టిఎంసి అడుగుల నీటిని నిల్వ చేయవచ్చు. రిజర్వాయర్ బండ్ 8.65 కిలోమీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పుతో పాటు 32.63 మీటర్ల ఎత్తులో ఉంది.. 1.1 లక్షల ఎకరాల భూమికి సాగునీరు ఇవ్వడం, పూర్వపు మెదక్ జిల్లాకు తాగునీరు సరఫరా చేయడం దీని నిర్మాణానికి గల ప్రధాన ఉద్దేశ్యం.