ఫైనల్‌లో ఆడే జట్లు ఇవే… తేల్చేసిన లిక్కర్ కింగ్!

|

Jul 03, 2019 | 12:51 AM

లండన్: భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలు పారిపోయిన ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా మంగళవారం కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. భారత్‌కు అప్పగింత ఆదేశాలపై గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసుకునేందుకు అనుమతించాలని మాల్యా అభ్యర్దించగా.. దానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఈ సందర్భంగా విలేకర్లు.. మాల్యాను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌పై మాల్యా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ఖచ్చితంగా వరల్డ్‌కప్ […]

ఫైనల్‌లో ఆడే జట్లు ఇవే... తేల్చేసిన లిక్కర్ కింగ్!
Follow us on

లండన్: భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలు పారిపోయిన ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా మంగళవారం కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. భారత్‌కు అప్పగింత ఆదేశాలపై గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసుకునేందుకు అనుమతించాలని మాల్యా అభ్యర్దించగా.. దానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఇక ఈ సందర్భంగా విలేకర్లు.. మాల్యాను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌పై మాల్యా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ఖచ్చితంగా వరల్డ్‌కప్ భారత్ సొంతం అవుతుందని అన్నాడు. ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య భీకర పోరు జరుగుతుందని మాల్యా తెలిపాడు.