ధోని అనుభవం భారత్‌కు అవసరం- షేన్‌ వార్న్‌

| Edited By: Pardhasaradhi Peri

Mar 13, 2019 | 2:40 PM

దిల్లీ: ధోని విమర్శకులపై ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మండిపడ్డాడు. 2019 ప్రపంచకప్‌లో భారత్‌కు అతడి సేవలు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. ‘‘ధోని గొప్ప ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. పరిస్థితులకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటాడు. ధోనీని విమర్శించే వాళ్లకు.. వాళ్లేమి మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు. ప్రపంచకప్‌లో భారత్‌కు అతడు అవసరం. అతడి అనుభవం, మైదానంలో కోహ్లీకి సహకరించడానికి అతడి నాయకత్వ నైపుణ్యం జట్టుకు అవసరం’’ అని […]

ధోని అనుభవం భారత్‌కు అవసరం- షేన్‌ వార్న్‌
Follow us on

దిల్లీ: ధోని విమర్శకులపై ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మండిపడ్డాడు. 2019 ప్రపంచకప్‌లో భారత్‌కు అతడి సేవలు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. ‘‘ధోని గొప్ప ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. పరిస్థితులకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటాడు. ధోనీని విమర్శించే వాళ్లకు.. వాళ్లేమి మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు. ప్రపంచకప్‌లో భారత్‌కు అతడు అవసరం. అతడి అనుభవం, మైదానంలో కోహ్లీకి సహకరించడానికి అతడి నాయకత్వ నైపుణ్యం జట్టుకు అవసరం’’ అని వార్న్‌ చెప్పాడు. కోహ్లి మంచి కెప్టెనే అయినా.. ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని అనుభవం అతడికి అవసరమని అన్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌లు ఫేవరెట్లుగా ప్రపంచకప్‌లో అడుగుపెడుతున్నాయని వార్న్‌ చెప్పాడు. ఐతే ఆస్ట్రేలియానే కప్పు గెలవగలదన్న నమ్మకం అతడు వ్యక్తం చేశాడు.