IND vs ENG: రాజ్‌కోట్‌లో రో’హిట్’.. 11వ సెంచరీతో కీలక ఇన్నింగ్స్.. ఓపెనర్స్‌లోనే మొనగాడు..

|

Feb 15, 2024 | 3:00 PM

Rohit Sharma Century: రాజ్‌కోట్ పిచ్‌పై రోహిత్ భారత జట్టుకు అడ్డుగోడగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అతడిని ఢీకొట్టడం కష్టంగా మారే విధంగా అతను తన పాదాలను సెట్ చేసుకున్నాడు. ఫలితంగా భారత్ బాధలకు బ్రేక్ పడడమే కాకుండా, టెస్టు క్రికెట్‌లో 10 ఇన్నింగ్స్‌ల పాటు ఎదురుచూసిన రోహిత్ శర్మ కూడా అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. రాజ్‌కోట్‌ మైదానంలో రోహిత్‌ శర్మ తొలి టెస్టు సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్‌లో టెస్టు సెంచరీ చేసిన ఓవరాల్‌గా 10వ, ఆరో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ నిలిచాడు.

IND vs ENG: రాజ్‌కోట్‌లో రోహిట్.. 11వ సెంచరీతో కీలక ఇన్నింగ్స్.. ఓపెనర్స్‌లోనే మొనగాడు..
Rohit Sharma Records
Follow us on

Rohit Sharma Century: రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ కేవలం 33 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి సంబరాలు చేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు.. రోహిత్ శర్మ మాత్రం ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు ఉంచలేదు. రోహిత్ క్రీజులో నిలబడినంత కాలం ఆనందం వారికి సొంతం కాదని ఇప్పటికే అర్థమైంది. రాజ్‌కోట్ పిచ్‌పై రోహిత్ భారత జట్టుకు అడ్డుగోడగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అతడిని ఢీకొట్టడం కష్టంగా మారే విధంగా అతను తన పాదాలను సెట్ చేసుకున్నాడు. ఫలితంగా భారత్ బాధలకు బ్రేక్ పడడమే కాకుండా, టెస్టు క్రికెట్‌లో 10 ఇన్నింగ్స్‌ల పాటు ఎదురుచూసిన రోహిత్ శర్మ కూడా అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు.

రాజ్‌కోట్‌ మైదానంలో రోహిత్‌ శర్మ తొలి టెస్టు సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్‌లో టెస్టు సెంచరీ చేసిన ఓవరాల్‌గా 10వ, ఆరో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ నిలిచాడు. గతేడాది జులైలో వెస్టిండీస్‌పై రోహిత్ తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు. ఆ తర్వాత రోహిత్‌ సెంచరీ చేసిన 11వ టెస్టు ఇన్నింగ్స్‌ ఇది.

రాజ్‌కోట్‌లో రోహిత్‌ ‘రాజ్‌’..

రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతని సెంచరీలో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్‌పై రోహిత్‌కిది మూడో టెస్టు సెంచరీ. ఇది అతని టెస్టు కెరీర్‌లో 11వ సెంచరీ కావడం విశేషం.

జడేజాతో కలిసి రోహిత్ భారీ భాగస్వామ్యం..

రాజ్‌కోట్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన సమయంలో రవీంద్ర జడేజాతో కలిసి సుదీర్ఘ భాగస్వామ్యం కూడా చేశాడు. ఈ దిగ్గజాల భాగస్వామ్య ఫలితమే ఒకప్పుడు బ్యాక్‌ఫుట్‌లో ఉన్న భారత జట్టు ఇప్పుడు మ్యాచ్‌లో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

భారత్ ప్లేయింగ్-XI:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్ ప్లేయింగ్-XI:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..