భారత్ గెలవాలని.. పాక్ ప్రార్థనలు

| Edited By: Ravi Kiran

Jun 30, 2019 | 2:26 PM

టీమిండియా గెలవాలని ఎవరైనా గట్టిగా కోరుకుంటున్నారంటే.. అది మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ జట్టు.. వారి అభిమానులే. అవును మీరు చదువుతుంది నిజమే. చరిత్రలో తొలిసారిగా భారత్‌కు సపోర్ట్ చేస్తున్నారు మన దాయాదులు. ఇప్పటికే భారత్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అయితే ఒక్క పాకిస్థాన్ జట్టు మాత్రమే కాదు. మన భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్న జట్లలో బంగ్లాదేశ్, కిందనున్న లంకేయులు కూడా టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు. అయితే వీరు ఇలా కోరుకోవడంలో వారి స్వార్థం […]

భారత్ గెలవాలని.. పాక్ ప్రార్థనలు
Follow us on

టీమిండియా గెలవాలని ఎవరైనా గట్టిగా కోరుకుంటున్నారంటే.. అది మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ జట్టు.. వారి అభిమానులే. అవును మీరు చదువుతుంది నిజమే. చరిత్రలో తొలిసారిగా భారత్‌కు సపోర్ట్ చేస్తున్నారు మన దాయాదులు. ఇప్పటికే భారత్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అయితే ఒక్క పాకిస్థాన్ జట్టు మాత్రమే కాదు. మన భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్న జట్లలో బంగ్లాదేశ్, కిందనున్న లంకేయులు కూడా టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు. అయితే వీరు ఇలా కోరుకోవడంలో వారి స్వార్థం ఉంది.

భారత జట్టు గెలిస్తేనే.. పాక్‌కు సెమీస్ వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఇంటికే. నిన్న పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి 9 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు 7 మ్యాచ్‌లు ఆడి.. 8 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఇంగ్లాండ్ మరింత కష్టాల్లోకి వెళ్తుంది. అదే పాక్‌కు కలిసివస్తుంది.

టీమిండియానే గెలిస్తే.. ఇంగ్లాండ్, పాక్ స్థానాల్లో పెద్ద మార్పు ఉండదు. అయితే ఆ టీమ్స్‌కు ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉంటుంది. ఇంగ్లాండ్, కివీస్‌తో.. పాక్, బంగ్లాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ గెలిచినా.. పాయింట్ల ప్రకారం అల్టిమేట్‌గా పాక్ సెమీస్‌కు చేరుతుంది. దీంతో భారత్ గెలవాలంటూ.. పాకిస్థానీలు బలంగా కోరుకుంటున్నారు.