ఇంగ్లండ్‌ను షేక్‌ చేసిన షమీ!

| Edited By:

Jun 30, 2019 | 10:23 PM

ఐసీసీ వరల్డ్‌కప్ 2019లో భారత బౌలింగ్‌ తరపున మహ్మద్‌ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లపై నాలుగేసి వికెట్లు చొప్పున సాధించి భారత విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. సెంచరీ సాధించి ఊపు మీద ఉన్న బెయిర్‌ స్టో(111)ను ఔట్‌ చేసిన షమీ…ఆపై ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(1) సైతం బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్‌ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో […]

ఇంగ్లండ్‌ను షేక్‌ చేసిన షమీ!
Follow us on

ఐసీసీ వరల్డ్‌కప్ 2019లో భారత బౌలింగ్‌ తరపున మహ్మద్‌ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లపై నాలుగేసి వికెట్లు చొప్పున సాధించి భారత విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. సెంచరీ సాధించి ఊపు మీద ఉన్న బెయిర్‌ స్టో(111)ను ఔట్‌ చేసిన షమీ…ఆపై ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(1) సైతం బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్‌ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో కీలకమైన రెండు వికెట్లు తీసి ఆ జట్టును ఒక్కసారిగా షేక్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ 32 ఓవర్‌ నాల్గో బంతికి బెయిర్‌ స్టోను పెవిలియన్‌కు పంపగా, 34 ఓవర్‌ నాల్గో బంతికి మోర్గాన్‌ వికెట్‌ తీశాడు. అదే సమయంలో ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించడం మరో విశేషం. ఈ రికార్డ్ సాధించిన వారిలో షమీ 6వ బౌలర్ గా నిలిచాడు.