టీమిండియా హెడ్‌కోచ్‌కు కొనసాగుతున్న ఇంటర్వ్యూలు

|

Aug 16, 2019 | 3:45 PM

మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఇవాళ టీమిండియా హెడ్‌ కోచ్‌కు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నేతృత్వంలో ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కొత్త ప్రధాన కోచ్‌ ఎవరన్న విషయాన్నిఆ సమావేశంలో వెల్లడించనున్నారు. న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ముంబై వచ్చారు.  తుది ఇంటర్వ్యూల కోసం బీసీసీఐ ఆరు మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన […]

టీమిండియా హెడ్‌కోచ్‌కు కొనసాగుతున్న ఇంటర్వ్యూలు
Follow us on

మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఇవాళ టీమిండియా హెడ్‌ కోచ్‌కు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నేతృత్వంలో ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కొత్త ప్రధాన కోచ్‌ ఎవరన్న విషయాన్నిఆ సమావేశంలో వెల్లడించనున్నారు. న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ముంబై వచ్చారు.  తుది ఇంటర్వ్యూల కోసం బీసీసీఐ ఆరు మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జాబితాలో ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రికే మళ్లీ హెడ్‌కోచ్‌ బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.