మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. సొంత బాబాయే గర్భిణిని చేశాడు..

మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికను సొంత బాబాయే గర్భిణిని చేశాడు. ఈ దారుణ ఘటన కురవి మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకెళితే.. కురవి మండలం పరిధి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. సొంత బాబాయే గర్భిణిని చేశాడు..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 11:08 AM

మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికను సొంత బాబాయే గర్భిణిని చేశాడు. ఈ దారుణ ఘటన కురవి మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకెళితే.. కురవి మండలం పరిధిలో ఓ తండాకు చెందిన బాలిక వేరే ప్రాంతంలో గల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే కరోనా కారణంగా స్కూల్‌కు సెలవులు ఉండటంతో అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సదరు బాలికపై బాబాయి వరుసైన వ్యక్తి వ్యామోహం పెంచుకున్నాడు. బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దంటూ బాలికను హెచ్చరించాడు. అయితే తాజాగా సదరు బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలికను పరిశీలించిన వైద్యులు గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఏం జరిగిందని బాలికను అడగగా అసలు విషయం బహిర్గతం చేసింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందిత వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.