విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి.. రాష్ట్రపతి ఆదేశం

President Ram Nath Kovind seeks report on suicide of students in Telangana, విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి.. రాష్ట్రపతి ఆదేశం

తెలంగాణలో జరిగిన ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీరియస్ అయ్యారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్రపతి కోవింద్ స్పందించారు. ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన కేంద్ర హోంశాఖను ఆదేశించారు. దీంతో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయి. దీంతో 27 మంది విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీటిపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఆరోపిస్తూ రాష్ట్రపతికి లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. తాజాగా విద్యార్ధుల పూర్తివివరాలు కూడా పంపించారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి పూర్తి వివరాల కోసం హోం శాఖను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *