రాజ్యసభకు అద్వానీ, జోషీ, సుష్మ ?

|

Jun 04, 2019 | 4:57 PM

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఇక రాజ్యసభ సీట్లపై దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో బాటు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మరికొందరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బహుశా ఈ వారంలో నిర్ణయం తీసుకోవచ్ఛునని భావిస్తున్నారు. రాజ్యసభలో త్వరలో 10 సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని ఎగువ సభకు పంపే అవకాశాలను మదింపు చేస్తున్నారు. వయసు మీరారన్న […]

రాజ్యసభకు అద్వానీ, జోషీ, సుష్మ ?
Follow us on

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఇక రాజ్యసభ సీట్లపై దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో బాటు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మరికొందరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బహుశా ఈ వారంలో నిర్ణయం తీసుకోవచ్ఛునని భావిస్తున్నారు. రాజ్యసభలో త్వరలో 10 సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని ఎగువ సభకు పంపే అవకాశాలను మదింపు చేస్తున్నారు. వయసు మీరారన్న కారణంపై అద్వానీ,
జోషీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లను నిరాకరించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ , నూతన హోమ్ మంత్రి అమిత్ షా ఇద్దరూ వీరి నివాసాలకు వెళ్లి వీరి ఆశీస్సులు తీసుకున్నారు. పైగా వీరిని మోదీ తన ట్విటర్ లో ఆకాశానికెత్తేశారు. అటు కేంద్ర మంత్రుల్లో కాస్త ‘పెద్ద వారైన ‘ ఎస్.జైశంకర్, రామ్ విలాస్ పాశ్వాన్లను కూడా రాజ్యసభకు పంపవచ్చు. ఆరోగ్య కారణాల దృష్ట్యా.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన సుష్మా స్వరాజ్ ను ఎంపిక చేస్తారా, లేదా అన్నది తేలాల్సి ఉంది.