గులాబీ బాస్’ మెరుపు ‘ వ్యూహం.. సైదిరెడ్డి గెలుపు వెనుక.. ?

| Edited By: Anil kumar poka

Oct 24, 2019 | 8:03 PM

హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆమెపై ఆయన 43, 233 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ నామ మాత్రంగా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, తన విజయం ఖాయమని భావించిన పద్మావతిరెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా.. ప్రధాన పోటీ […]

గులాబీ బాస్ మెరుపు  వ్యూహం.. సైదిరెడ్డి గెలుపు వెనుక.. ?
Follow us on

హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆమెపై ఆయన 43, 233 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ నామ మాత్రంగా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, తన విజయం ఖాయమని భావించిన పద్మావతిరెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి.

మొత్తం 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీ ఆర్ ఎస్ , కాంగ్రెస్ మధ్యే నడిచింది. అసలు ఆర్టీసీ సమ్మె రాజకీయంగా తమకు లాభిస్తుందని, హుజూర్ నగర్ స్థానాన్ని తాము కైవసం చేసుకోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఆశించినా వారి ఆశలు వమ్మయ్యాయి. నిజానికి సీఎం, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రచార సభలు లేకున్నా ఈ నియోజకవర్గంలో ఆ లోటు తీర్చేందుకు తెరాస నాయకులూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ స్వయంగా ఇక్కడ ప్రచార సరళిని పర్యవేక్షించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజూర్ నగర్ లో 7,466 ఓట్ల తేడాతో ఓడిపోయినా.. మళ్ళీ ఈ సారి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం వెనుక కేసీఆర్ వ్యూహ చతురత ఎంతో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అన్ని స్థాయిల్లో దాదాపు 70 మందిని ఆయా మండలాల్లో మోహరించడం,

గతంతో పోలిస్తే ఈ మారు ఓటు బ్యాంకు పెరగడం, పోల్ మేనేజ్ మెంట్ లో తెరాస వంద శాతం సఫలం కావడం ఈ పార్టీకి ప్లస్ పాయింట్లయ్యాయి. ప్రతి 60..70 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను ఇన్-ఛార్జిగా నియమించి ఓటర్లను బూత్ వరకు తరలించడంలో వారు పూర్తిగా కృతకృత్యులయ్యారు. ఈ నియోజకవర్గంలో తొలిసారి టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేయడం విశేషం. పైగా ఇప్పటివరకు ఇక్కడ 29,194 ఓట్ల మెజారిటీ ఉండేది.

కానీ సైదిరెడ్డి భారీ మెజారిటీతో ఆ రికార్డును బద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం లేదని ఈ ఫలితాలు నిరూపించాయని మంత్రి జగదీశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. అటు-నిజానికి ఇది కేసీఆర్ గెలుపని సైదిరెడ్డి ప్రకటించి తన వినమ్రతను చాటుకున్నారు.