చీరాలలో వేడెక్కిన తెలుగు రాజకీయం

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:30 PM

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ తరుపున టిక్కెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కరణం బలరాం, డాక్టర్ పాలేటి రామారావుల మధ్య హోరాహోరీ పరిస్థితి ఉంది. తాజాగా కరణం బలరాంకే టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో పాలేటి వర్టీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలేటి బీసీ నాయకుడు కాగా, కరణం బలరాం ఓసీ. చీరాల నియోజకవర్గంలో మొత్తం లక్షా 80 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. అందులో 75 శాతం […]

చీరాలలో వేడెక్కిన తెలుగు రాజకీయం
Follow us on

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ తరుపున టిక్కెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కరణం బలరాం, డాక్టర్ పాలేటి రామారావుల మధ్య హోరాహోరీ పరిస్థితి ఉంది. తాజాగా కరణం బలరాంకే టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో పాలేటి వర్టీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలేటి బీసీ నాయకుడు కాగా, కరణం బలరాం ఓసీ. చీరాల నియోజకవర్గంలో మొత్తం లక్షా 80 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. అందులో 75 శాతం వరకూ బీసీ ఓట్లే ఉన్నాయి. దీంతో బీసీ నాయకుడైన పాలేటికి టిక్కెట్ ఇస్తేనే గలిచే అవకాశం ఉంటుందని ఆయన అనుచరులు అంటున్నారు.

అయితే కరణం బలరాంకు కూడా మంచి పేరుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు పలుకుపడి ఉంది. కరణం బలరాంది నిజానికి అద్దంకి నియోజకవర్గం అయితే అక్కడ గొట్టిపాటి రవి కుమార్ బలంగా ఉన్నారు. అక్కడ ఆయనకే టిక్కెట్ కన్ఫామ్ చేశారు. బలరాంకు, గొట్టిపాటి రవికుమార్‌కు చాలా కాలంగా పడటం లేదు. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గం టిక్కెట్ కోసం కరణం ప్రయత్నించారు.

పార్టీ కూడా ఆయనకే ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో పరిస్థితి వేడెక్కింది. పాలేటి వర్గీయులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే పాలేటి మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంటున్నారు. మరి రాజకీయంగా వేడిక్కిన చీరాల టీడీపీ విషయంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో, టిక్కెట్ దక్కని వారికి ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.