స్టాలిన్‌కు తంబీల షాక్.. అన్నా డీఎంకే విజయానికి కారణమిదేనా ?

| Edited By: Anil kumar poka

Oct 24, 2019 | 8:00 PM

  తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకెకి షాక్ తగిలింది. రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి స్థానాలకు జరిగిన బై పోల్స్ లో విక్రవండి సీటును అన్నా డీఎంకే కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ అభ్యర్థి ఆర్.ముతమిల్ సెల్వన్ విజయం సాధించారు. నంగునేరిలోనూ ఇదే పార్టీ క్యాండిడేట్ నారాయణన్ గెలుపు దిశగా సాగుతున్నారు. ఈ ఉపఎన్నికల్లో తమదే విజయమని డీఎంకే ధీమాగా ఉంటూ వచ్చింది. కానీ ఓటర్ల తీరు మరోలా ఉంది. […]

స్టాలిన్‌కు తంబీల షాక్.. అన్నా డీఎంకే విజయానికి కారణమిదేనా ?
Follow us on

 

తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకెకి షాక్ తగిలింది. రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి స్థానాలకు జరిగిన బై పోల్స్ లో విక్రవండి సీటును అన్నా డీఎంకే కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ అభ్యర్థి ఆర్.ముతమిల్ సెల్వన్ విజయం సాధించారు. నంగునేరిలోనూ ఇదే పార్టీ క్యాండిడేట్ నారాయణన్ గెలుపు దిశగా సాగుతున్నారు.

ఈ ఉపఎన్నికల్లో తమదే విజయమని డీఎంకే ధీమాగా ఉంటూ వచ్చింది. కానీ ఓటర్ల తీరు మరోలా ఉంది. తమిళనాడు అసెంబ్లీలో 235 సీట్లకు గాను ప్రస్తుతం 122 మంది ఏఐడీఎంకె సభ్యులు ఉండగా.. డీఎంకె సభ్యులు వంద మంది ఉన్నారు. తాజాగా ఈ రెండు నియోజకవర్గాలను ఏఐడీఎంకె కైవసం చేసుకోవడంతో మరో రెండు స్థానాలు ఈ పార్టీకి లభించనున్నాయి.

నిజానికి ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాలకు గాను 22 సీట్లను డీఎంకె గెలుచుకుని దూకుడు పెంచింది. అదే జోరు ఈ ఉపఎన్నికల్లో కనిపిస్తుందని అంతా ఊహించినా.. సీన్ రివర్స్ అయింది.