‘చౌదరికి విరామం’, లోక్ సభలో ఇక కాంగ్రెస్ పక్ష నేత రవ్ నీత్ సింగ్ బిట్టూ

| Edited By: Anil kumar poka

Mar 11, 2021 | 6:54 PM

లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానే ఈ పార్టీకి చెందిన మరో నాయకుడు రవ్ నీత్ సింగ్ బిట్టూను ఈ పదవిలో నియమించారు.

చౌదరికి విరామం, లోక్ సభలో ఇక కాంగ్రెస్ పక్ష నేత రవ్ నీత్ సింగ్ బిట్టూ
Follow us on

లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానే ఈ పార్టీకి చెందిన మరో నాయకుడు రవ్ నీత్ సింగ్ బిట్టూను ఈ పదవిలో నియమించారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు అయన ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. బెంగాల్ కాంగ్రెస్ శాఖ చీఫ్ అయిన అధిర్ రంజన్ చౌదరి ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలైనందున మరో రెండు నెలలపాటు ఆయన ఆ బాధ్యతల్లోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక 45 ఏళ్ళ బిట్టూ లోక్ సభలో పార్టీ వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తారు. సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ అయిన గౌరవ్ గొగోయ్ అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు.  కాగా-బిట్టూ మొదట 2009 లో ఆనంద్ పూర్ సాహిబ్ నుంచి, ఆ తరువాత 2014,  2019 లో లోక్ సభకు ఎన్నికయ్యారు. పంజాబ్ మాజీ సీఎం దివంగత బియాంత్ సింగ్ మనవడే  ఈ బిట్టూ.(1995 లో బియాంత్ సింగ్ హత్యకు గురయ్యారు.)

ఇక రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు బిట్టూ మద్దతునివ్వడమే కాదు.. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. పైగా సింఘు బోర్డర్ లో ప్రదర్శన జరుగుతుండగా ఈయనపై దాడి జరిగింది. 2009 లో పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరించిన ఈయన.. డ్రగ్ అడిక్షన్ కి వ్యతిరేకంగా ఉద్యమించాడు. 2011 లో కొన్ని రోజులపాటు నిరాహార దీక్ష చేసి తమ రాష్ట్రంలో డ్రగ్ ప్రివెన్షన్ బోర్డును ఏర్పాటు చేసేలా చూశారు. బిట్టూ కొత్త నియామకం పార్టీ వర్గాలను ఆశ్చర్య పరిచింది.  చడీ చప్పుడు లేకుండా పార్టీ బిట్టూను కీలకపదవిలో నియమించడం ముఖ్య నేతలకు అంతు పట్టడంలేదు. బెంగాల్ ఎన్నికల అనంతరం మళ్ళీ అధిర్ రంజన్ చౌదరిని లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిస్తారా లేక బిట్టూకే ఈ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Isha Foundation Mahashivratri : ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు, హాజరైన ప్రధాని నరేంద్రమోదీ

MLC election in Telangana: మందుబాబులకు షాక్.. మద్యం అమ్మకాలు బంద్.. తెరుచుకునేంది ఎప్పుడంటే..