Punjab Next CM: నెక్స్ట్‌ ఎవరు.. పంజాబ్‌ సీఎం పీఠం ఎవరిది.. ఆయనైతే ఒప్పుకునేది లేదు..

| Edited By: Sanjay Kasula

Sep 19, 2021 | 3:12 PM

నెక్స్ట్‌ఎవరు..? పంజాబ్‌ సీఎం పీఠం ఎవరిది..? ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పీసీసీ చీఫ్‌ సిద్ధూతో విభేదాలతో..ఇక ముఖ్యమంత్రిగా..

Punjab Next CM: నెక్స్ట్‌ ఎవరు.. పంజాబ్‌ సీఎం పీఠం ఎవరిది.. ఆయనైతే ఒప్పుకునేది లేదు..
Next Punjab Cm
Follow us on

నెక్స్ట్‌ఎవరు..? పంజాబ్‌ సీఎం పీఠం ఎవరిది..? ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పీసీసీ చీఫ్‌ సిద్ధూతో విభేదాలతో..ఇక ముఖ్యమంత్రిగా కొనసాగలేనిని పదవికి రాజీనామా చేశారు అమరీందర్‌ సింగ్‌. దీంతో ఎన్నికల వేళ పార్టీని విజయతీరాలకు చేర్చే నేత కోసం వేట ప్రారంభించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అమరీందర్‌ వారసుడిని ఎన్నుకునేందుకు ఇవాళ సీఎల్పీ మరోసారి భేటీ కానుంది.

ఐతే పంజాబ్‌ సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌ సిద్ధూతో పాటు మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాఖడ్‌, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్‌, ప్రతాప్‌ సింగ్‌ భజ్వా, రణ్వీత్‌ బిట్టు, మాజీమంత్రి సుఖ్జీందర్‌ సింగ్‌ రంధావా పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే తాజాగా సీనియర్‌ నేత అంబికా సోనీ పేర్లు తెరమీదికొచ్చింది. ఐతే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌..సిద్ధూను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా సిద్ధూను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.

గత కొంతకాలంగా పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమరీందర్ సింగ్‌కు వ్యతిరేక వర్గంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది వరకు అధిష్టానానికి ఓ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని వారు లేఖలో డిమాండ్ చేశారు. ఇక, పార్టీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో అమరీందర్ సింగ్ విసిగిపోయాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సెప్టెంబర్ 18 కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది.. ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే రకమైన ఆదేశాలు జారీచేశారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం అమరీందర్ సింగ్‌ను కోరినట్టుగా ఆ వర్గాలు చెప్పాయి. దీంతో పంజాబ్​ సీఎం అమరీందర్​ రాజీనామా చేసినట్లు తెలిసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..