జూ.ఎన్టీఆర్ కి జగన్ గ్రీన్ సిగ్నల్..?

|

Jul 24, 2019 | 7:32 AM

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలవడం, జగన్ సీఎం కావడంతో రాష్ట్రంలో అనేక ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి కాస్త దూరంగా ఉండటంతో ఆయన వైసీపీకి దగ్గరైతే… అదుర్సే.. అన్న ప్రచారాలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సీఎం జగన్ జూ.ఎన్టీఆర్ ను ఏపీ టూరిజం ఎంబాసిడర్ గా నియమించే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ఆయనతో చర్చలు జరిపాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయట. అయితే […]

జూ.ఎన్టీఆర్ కి జగన్ గ్రీన్ సిగ్నల్..?
Follow us on

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలవడం, జగన్ సీఎం కావడంతో రాష్ట్రంలో అనేక ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి కాస్త దూరంగా ఉండటంతో ఆయన వైసీపీకి దగ్గరైతే… అదుర్సే.. అన్న ప్రచారాలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో సీఎం జగన్ జూ.ఎన్టీఆర్ ను ఏపీ టూరిజం ఎంబాసిడర్ గా నియమించే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ఆయనతో చర్చలు జరిపాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయట. అయితే జూ.ఎన్టీఆర్ పై గతంలోనూ ఇలాంటి ప్రచారాలు జరిగాయి. మధ్యపాన నిషేధానికి ఎంబాసిడర్ గా నియమిస్తారని.. కానీ అందుకు జగన్ ను మించిన అంబాసిడర్ లేరని వైసీపీ వర్గాలు తేల్చేసాయి.

అయితే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటంతో జగన్ తో కలిసి పనిచేస్తారనే ఊహాగానాలకు సోషల్ మీడియా వేదిక అవుతోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం ఎన్టీఆర్ తో ఎలాంటి చర్చలు జరపలేదని, ఇలాంటి ప్రచారాలకు అడ్డు కట్ట వెయ్యాలని ప్రభుత్వవర్గాలు యోచిస్తున్నాయట.