రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు : మేనకా గాంధీ

| Edited By:

Apr 06, 2019 | 5:55 PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి మేనకా గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధికారం కోసం వెంపర్లాడుతోందని దుయ్యబట్టారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయడంపై మేనకా స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉందని.. ఎవరైనా రెండు స్థానాల్లో బరిలోకి దిగవచ్చని అన్నారు. ఇక అందరూ అనుకున్నట్లు ఈ ఎన్నికల్లో ప్రియాంక ప్రభావం ఎవరి మీదా ఉండదు అని […]

రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు : మేనకా గాంధీ
Follow us on

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి మేనకా గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధికారం కోసం వెంపర్లాడుతోందని దుయ్యబట్టారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయడంపై మేనకా స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉందని.. ఎవరైనా రెండు స్థానాల్లో బరిలోకి దిగవచ్చని అన్నారు. ఇక అందరూ అనుకున్నట్లు ఈ ఎన్నికల్లో ప్రియాంక ప్రభావం ఎవరి మీదా ఉండదు అని అన్నారు.

సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న మేనకా గాంధీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నా భర్త సంజయ్‌ గాంధీ రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్‌ గాంధీ గెలుపొందారు. ఈసారి నాతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సారి కూడా విజయం మాదే. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమితో ఎలాంటి ప్రమాదం లేదని.. వచ్చే ఎన్నికల్లో తామే మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నామని మేనకా గాంధీ అన్నారు.