కలెక్టర్లతో ఏపీ ఎస్‌ఈసీ వీడియోకాన్ఫరెన్స్‌.. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్‌పై కీలక ఆదేశాలు

|

Jan 27, 2021 | 4:18 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్..

కలెక్టర్లతో ఏపీ ఎస్‌ఈసీ వీడియోకాన్ఫరెన్స్‌.. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్‌పై కీలక ఆదేశాలు
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ హాజరయ్యారు.

పంచాయతీలకు సంబంధించి బుధవారం తొలిదశ నోటిఫికేషన్ విడుదలకానుంది. 29వ తేదీ నుంచి జిల్లాల్లో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయన్నారు. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.

అంతకుముందు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణ చర్యల గురించి కూడా ఆయన గవర్నర్‌కు తెలియజేశారు. అనంతరం ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.