1 / 5
ఆల్ రౌండర్లు.. పాండ్యా సోదరుల పేర్లు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరేమో. అంతలా వారిద్దరూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి స్టార్ క్రికెటర్లు అయ్యారు. అనేక అంతర్జాతీయ మ్యాచ్ లలో అద్భుత ప్రతిభ కనబరిచి, ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ తమదైన ముద్ర వేసుకున్నారు. ఆల్ రౌండర్లుగా అదర గొడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో ప్రతిభ చూపుతూ ఎందరో అభిమానులను సంపాదించారు.