బెలూన్లకన్నా క్యూట్ బాయ్… ఫిదా అయిన నుస్రత్ జహాన్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ ఓ లిటిల్ బాయ్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి అతడికి ఫిదా అయిపొయింది. ఢిల్లీలో వీకెండ్ లో అలా తాను బయటికి వెళ్ళినప్పుడు వీధిలో ఓ పక్కన బెలూన్లు అమ్ముతున్న దాదాపు రెండేళ్ల కుర్రాడిని చూసి ముచ్ఛట పడిపోయింది. వేలెడంత లేడు.. ఈ బుడతడు అప్పుడే పెద్ద మగాడిలా బెలూన్లను అమ్ముతున్నాడంటూ వాడ్ని ఎత్తుకుని.. ముద్దులు కురిపించింది. ‘ వీడు నా వీకెండ్ ని స్పెషల్ చేశాడు.. […]

బెలూన్లకన్నా క్యూట్ బాయ్... ఫిదా అయిన నుస్రత్ జహాన్
Follow us

|

Updated on: Dec 11, 2019 | 4:52 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ ఓ లిటిల్ బాయ్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి అతడికి ఫిదా అయిపొయింది. ఢిల్లీలో వీకెండ్ లో అలా తాను బయటికి వెళ్ళినప్పుడు వీధిలో ఓ పక్కన బెలూన్లు అమ్ముతున్న దాదాపు రెండేళ్ల కుర్రాడిని చూసి ముచ్ఛట పడిపోయింది.

వేలెడంత లేడు.. ఈ బుడతడు అప్పుడే పెద్ద మగాడిలా బెలూన్లను అమ్ముతున్నాడంటూ వాడ్ని ఎత్తుకుని.. ముద్దులు కురిపించింది. ‘ వీడు నా వీకెండ్ ని స్పెషల్ చేశాడు.. రెండేళ్ల ఈ కుర్రాడు రంగురంగుల బెలూన్లకన్నా మరింత అందంగా, క్యూట్ గా ఉన్నాడు.. లవ్ ఫర్ ఆల్.. లవ్ ఈజ్ ఓన్లీ లాంగ్వేజ్ అంటూ తన ట్విట్టర్లో నుస్రత్ పోస్ట్ పెట్టింది. ఇక ఈ అందాల ఎంపీ, ముద్దులు మూట కట్టే ఈ బుడతడి ఫొటోలతో ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.

ఈ పోస్టుకు ఎన్నో లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తాయి. ఆమెది ఎంత జాలి గుండె అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.పౌరసత్వ సవరణ బిల్లుపై ఓ వైపు పార్లమెంటులో హాట్ హాట్ చర్చ జరుగుతుంటే మరోవైపు ఈమె ఇలా ఓ వీధి కుర్రాడి అమాయక చూపులకు ఫిదా అయిపోవడం విశేషం.