చైనాపై కసి…జొమాటో ఉద్యోగులు ఏం చేశారంటే

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 11:01 AM

కోల్ కతాలో జొమాటోలో పని చేసే డెలివరీ బాయ్ లు, ఇతర ఉద్యోగులు చైనా పై పరోక్షంగా కసి తీర్చుకున్నారు. తాము ధరించిన టి-షర్టులను చించివేసి వాటిని తగులబెట్టారు. గాల్వన్ లోయలో చైనా సైనికులు మన సైనికుల్లో 20 మందిని పొట్టన..

చైనాపై కసి...జొమాటో ఉద్యోగులు ఏం చేశారంటే
Follow us on

కోల్ కతాలో జొమాటోలో పని చేసే డెలివరీ బాయ్ లు, ఇతర ఉద్యోగులు చైనా పై పరోక్షంగా కసి తీర్చుకున్నారు. తాము ధరించిన టి-షర్టులను చించివేసి వాటిని తగులబెట్టారు. గాల్వన్ లోయలో చైనా సైనికులు మన సైనికుల్లో 20 మందిని పొట్టన బెట్టుకున్నారని, మన భూభాగాన్ని ఆక్రమించుకోజూస్తున్నారని వారు ఆరోపించారు. తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన కొందరు.. జొమాటో సంస్థలో చైనా పెట్టుబడులు భారీగా ఉన్నాయని, ఇక్కడి నుంచి వాళ్ళు లాభాలు పొందుతూ.. మరోవైపు మన సైనికులను హతమారుస్తున్నారని అన్నారు. ఈ కంపెనీ ద్వారా ఫుడ్ కి ఆర్డర్ ఇవ్వరాదని ప్రజలను కోరారు. 2018 లో చైనీస్ కంపెనీ అలీబాబా.. జొమాటోలో 14.7 శాతం వాటాతో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే తమ పెట్టుబడులకు రెట్టింపు లాభాలు పొందుతూ.. మన ‘కంటిని’ పొడుస్తున్నారని జొమాటో సిబ్బంది ఆరోపించారు.  కరోనా వైరస్ కారణంగా గత మే నెలలో జొమాటో సంస్థ 520 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ మాజీ ఉద్యోగులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారా అన్న విషయం తెలియలేదు.