‘ప్లాస్మా ఇచ్చా..ఇది సూపర్ కూల్ అనుభవం’.. నటి జోవా మొరానీ

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 3:58 PM

కరోనా వ్యాధికి గురైన నటి జోవా మొరానీ ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ప్లాస్మా థెరపీ కోసం తన బ్లడ్ ని డొనేట్ చేశానని, ఇప్పుడు సూపర్ కూల్ గా ఉందని ఆమె తన ఇన్స్ టా గ్రామ్ లో పేర్కొన్నారు...

ప్లాస్మా ఇచ్చా..ఇది సూపర్ కూల్ అనుభవం.. నటి జోవా మొరానీ
Follow us on

కరోనా వ్యాధికి గురైన నటి జోవా మొరానీ ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ప్లాస్మా థెరపీ కోసం తన బ్లడ్ ని డొనేట్ చేశానని, ఇప్పుడు సూపర్ కూల్ గా ఉందని ఆమె తన ఇన్స్ టా గ్రామ్ లో పేర్కొన్నారు. ముంబైలోని నాయర్ ఆసుపత్రిలో నా రక్తాన్ని ఇచ్చాను. ఇది నాకెంతో సూపర్ కూల్ అనుభవాన్ని కలిగించింది..ఎమర్జెన్సీ వస్తే తక్షణం చికిత్స చేసేందుకు నా వద్దే జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు. అని ఆమె తెలిపారు. కరోనా రోగులు కోలుకునేందుకు ఉపయోగపడే ప్లాస్మా థెరపీ ట్రయల్స్ లో ఇలా నేను కూడా ఓ భాగమైనందుకు సంతోషిస్తున్నా అని ఆమె వెల్లడించింది. ఇంతే కాదు.. ‘వీళ్ళు నాకు ఓ సర్టిఫికెట్, రూ. 500 ఇచ్చారు.’ అని కూడా జోవా మొరానీ స్పష్టంగా పేర్కొంది.

లోగడ శ్రీలంక నుంచి వఛ్చిన ఈమె సోదరి షజా కారణంగా జోవాకు కరోనా సోకింది. మొదట టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగెటివ్ అని వఛ్చినా మళ్ళీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకున్నప్పుడు పాజిటివ్ అని వచ్చిందట. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానీ కుమార్తె అయిన ఈమె 2007 లో ఫరా ఖాన్ మూవీ ‘ఓం శాంతి ఓం’ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. ఆ తరువాత 2011 లో షారుఖ్ ఖాన్ తీసిన ‘ఆల్వేస్ కభీ కభీ’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ‘భాగ్ జానీ’ సినిమాలోనూ నటించింది.  ఈమె తండ్రి కరీం మొరానీ.. ‘రా..వన్’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’,’హ్యాపీ న్యూ ఇయర్’, ‘దిల్ వాలే’ వంటి హిట్ మూవీలు నిర్మించారు.