త్రిభాషా సూత్రాన్ని అనుమతించం, తమిళనాడు సీఎం పళనిస్వామి

| Edited By: Anil kumar poka

Aug 03, 2020 | 11:54 AM

జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని అనుమతించబోమని తమిళనాడు సీఎం  పళనిస్వామి ప్రకటించారు. కేంద్రం చర్య చాలా బాధాకరమని, విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.

త్రిభాషా సూత్రాన్ని అనుమతించం, తమిళనాడు సీఎం పళనిస్వామి
Follow us on

జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని అనుమతించబోమని తమిళనాడు సీఎం  పళనిస్వామి ప్రకటించారు. కేంద్రం చర్య చాలా బాధాకరమని, విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. దీని అమలుపై పునరాలోచించాలని ప్రధానిని కోరిన ఆయన.. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని పాటిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. తమ రాష్ట్రంపై హిందీ భాషను కావాలనే రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, అందుకే ఈ జాతీయ విద్యా విధానాన్ని తెచ్చిందని రాష్ట్రంలో పలు రాజకీయపార్టీలు భావిస్తున్నాయి. 1965 లో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున  ఆందోళన నిర్వహించిన విషయాన్ని ఈ పార్టీలు  గుర్తు చేశాయి.

గతంలో డీఎంకె నేతృత్వంలోని చిన్నా చితకా పార్టీలు కూడా హిందీ భాషను తమ రాష్ట్రంపై రుద్దితే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్రాన్ని హెచ్ఛరించాయి.