‘మీది బాల్కనీ ప్రభుత్వం’.. మోదీపై కమల్ హాసన్ ఫైర్

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:07 PM

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా పేదలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రధాని మోదీకి రాసిన సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నారు.

మీది బాల్కనీ ప్రభుత్వం.. మోదీపై కమల్ హాసన్ ఫైర్
Follow us on

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా పేదలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రధాని మోదీకి రాసిన సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నారు. నాడు  పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుని తప్పు చేశారని, ఇప్పడు అలాంటి తప్పే మళ్ళీ చేశారని ఆయన విమర్శించారు. దేశంలోని ఇన్ని కోట్లమంది ప్రజలు మిమ్మల్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. మీరేం చెబితే అది చేస్తున్నారు.. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలను అభినందిస్తూ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టమంటే వారు కొట్టారు. అలాగే ఈ నెల 5 వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిముషాల పాటు ఇళ్లలోని లైట్లు ఆర్పేసి బాల్కనీలు, తలుపుల వద్ద కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించమంటే అలాగే చేశారు. మీ పట్ల వారికి ఉన్న అపారమైన గౌరవాన్ని ఎప్పటికప్పుడు చూపుతున్నారు. మీది బాల్కనీ ప్రభుత్వం గాక ! కానీ ఆ చీకట్లలో వేలాది పేదల ఇళ్లలో కాంతులను మనం చూడగలిగామా ? లాక్ డౌన్ కారణంగా అనేకమంది కార్మికులు, నిర్మాణ రంగ శ్రామిక జీవులు తమ స్వస్థలాలకు వెళ్ళలేక నానా అగచాట్లూ పడుతున్నారు. పిల్లా పాపలతో మహిళలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.. వారి కష్టాలను గమనించారా ? అని కమల్ హాసన్ ప్రశ్నించారు. నిజానికి కరోనా మన దేశంలో ప్రవేశించడానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్ఛేవా అంటూ ఆయన…. ఈ మహమ్మారి ఎప్పుడు మన దేశంలో ఎంటరయిందీ, చైనాలో ఎప్పుడు పుట్టిందీ తేదీలతో సహా గుర్తు చేశారు. ఇన్ని పొరబాట్లు చేస్తున్నా  మీ వెంటే మేము ఉంటున్నాం..ఇప్పటికైనా పరిస్థితిని గమనించి పేదల ఆకలిని తీర్చేందుకు, వారిని వారివారి స్వస్థలాలకు పంపేందుకు. లాక్ డౌన్ ఎత్తివేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన కోరారు.