ప్రాణాలకు తెగించి….నది మధ్యలో సెల్ఫీ..అమ్మాయిల దుస్సాహసం

| Edited By: Pardhasaradhi Peri

Jul 25, 2020 | 12:35 PM

మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో కొందరు టీనేజీ విద్యార్థినులు పిక్నిక్ కి వెళ్లి దాదాపు తమ ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు.  భారీ వర్షాలు, వరదలకు అక్కడి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ అమ్మాయిల్లో..

ప్రాణాలకు తెగించి....నది మధ్యలో సెల్ఫీ..అమ్మాయిల దుస్సాహసం
Follow us on

మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో కొందరు టీనేజీ విద్యార్థినులు పిక్నిక్ కి వెళ్లి దాదాపు తమ ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు.  భారీ వర్షాలు, వరదలకు అక్కడి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ అమ్మాయిల్లో ఇద్దరు పెంచ్ నది వద్దకు వెళ్లి సరదాగా గడుపుదామనుకున్నారు. నది మధ్యలో రాళ్లపై నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో వెనక్కి వెనక్కి వెళ్లలేకపోయారు. వీరికి రాగల ప్రమాదాన్ని చూసిన ఇతర విద్యార్థినులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పరుగులు పెడుతూ వారు వచ్చారు. స్థానికులు కూడా వీరికి తోడై.. అతి కష్టం మీద ఆ ఇద్దరు యువతులను రక్షించారు. మొత్తానికి డేంజర్ నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు బయటపడ్డారు. ఇంత జరిగినా వాళ్ళు నింపాదిగా తమకేమీ జరగనట్టుగానే వెళ్లిపోయారు. కాగా..అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ఆ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. బీహార్ లో 30 లక్షలు, అస్సాంలో 36 లక్షలమంది నిరాశ్రయులయ్యారు.