దూబే కేసు.. సహచరుడు ‘వాంటెడ్’ లిస్టులో లేడట !

| Edited By: Pardhasaradhi Peri

Jul 12, 2020 | 12:51 PM

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసులో అతని సహచరుడైన గుడాన్ రామ్ విలాస్ త్రివేదీ అనే వ్యక్తిని మహారాష్ట్రలో అరెస్టు చేశారు. అయితే అతని పేరు వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ లో గానీ,  ఎనిమిది మంది పోలీసుల మృతి కేసులో..

దూబే కేసు.. సహచరుడు వాంటెడ్ లిస్టులో లేడట !
Follow us on

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసులో అతని సహచరుడైన గుడాన్ రామ్ విలాస్ త్రివేదీ అనే వ్యక్తిని మహారాష్ట్రలో అరెస్టు చేశారు. అయితే అతని పేరు వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ లో గానీ,  ఎనిమిది మంది పోలీసుల మృతి కేసులో గానీ లేదని కాన్పూర్ పోలీసులు తెలిపారు. అరవింద్ అలియాస్ రామ్ విలాస్ త్రివేదీని, ఇతని డ్రైవర్ అయిన సోను తివారీని మహారాష్ట్ర  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు థానే లో అరెస్టు చేశారు. వీరిద్దరూ వికాస్ దూబే పాత గ్యాంగ్ సభ్యులని కాన్పూర్ ఎస్పీ దినేష్ కుమార్ ప్రభు తెలిపారు. (ఎన్ కౌంటర్ లో వికాస్ దూబే మృతి చెందిన విషయం విదితమే). కాన్పూర్ లోని బిక్రు గ్రామ ఊచకోత కేసులో నిందితులని చెబుతున్న మరో 14 మందితో బాటు త్రివేదీ ఫోటోను పోలీసులు ఎందుకు రిలీజ్ చేశారో తెలియడంలేదు.

కానీ… వికాస్ దూబేతో బాటు త్రివేదీ పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. 2001 లో యూపీ మంత్రి సంతోష్ శుక్లా ను పోలీసు స్టేషన్ లో కాల్చి చంపిన కేసులో ఇతని ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. కాన్పూర్ ఘటన అనంతరం త్రివేదీ… బిక్రు గ్రామంలోని ఓ షాపులో తన ఫోన్ ఇచ్చి తన డ్రైవర్ తో బాటు మధ్యప్రదేశ్ కి పరారయ్యాడు. అక్కడి దాటియా ప్రాంతం నుంచి నాసిక్ కి, ఆ తర్వాత పూణెకి వెళ్లి చివరకు థానే చేరుకున్నాడట. థానేలో పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.