ఉదయం 8 గంటలు… ఉజ్జయిని.. మహాకాల్ టెంపుల్ లో …

| Edited By: Pardhasaradhi Peri

Jul 09, 2020 | 11:20 AM

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉజ్జయినిలో మహాకాల్ ఆలయంలో 'ప్రత్యక్షమయ్యాడు'. గుడిలో పూజలు చేసేందుకు పూజా సామగ్రి కొనుగోలు చేసి ఇతడు టెంపుల్ లోకి వెళ్తుండగా..

ఉదయం 8 గంటలు... ఉజ్జయిని.. మహాకాల్ టెంపుల్ లో ...
Follow us on

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉజ్జయినిలో మహాకాల్ ఆలయంలో ‘ప్రత్యక్షమయ్యాడు’. గుడిలో పూజలు చేసేందుకు పూజా సామగ్రి కొనుగోలు చేసి ఇతడు టెంపుల్ లోకి వెళ్తుండగా.. షాపు యజమాని గుర్తించి సెక్యురిటీ గార్డులను అలర్ట్ చేశాడని తెలిసింది. ఆలయం నుంచి దూబే బయటకి రాగానే గార్డులు అతడ్ని ప్రశ్నించారు. మొదట దూబే ఫేక్ ఐడెంటిటీ కార్డు చూపగా.. అందులో మరీ యువకునిగా ఉన్న ఫోటో కనిపించడంతో గార్డులకు అనుమానం కలిగి తమ ప్రశ్నలను రెట్టించారని తెలుస్తోంది. దాంతో దూబే వారితో గొడవకు దిగాడని,  ‘మై వికాస్ దూబే.. కాన్పూర్ వాలా’ (నేను వికాస్ దూబేని.. కాన్పూర్ వాసిని) అని కేకలు పెట్టాడని తెలిసింది. అయితే గార్డులు అతడ్ని కొట్టి పోలీసు వ్యాన్ ఎక్కించారట. ముఖానికి మాస్క్ ధరించిన దూబేని నలుగురైదుగురు పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

వికాస్ దూబే అరెస్టు పోలీసులకు పెద్ద విజయమని, అతడు క్రూర హంతకుడని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. అతడి పట్టివేతకు తమ రాష్ట్ర పోలీసులంతా అలర్ట్ గా ఉన్నారని, మహాకాల్ టెంపుల్ లో అతడిని అరెస్టు చేశారని ఆయన చెప్పారు. అతడు పట్టుబడిన విషయాన్ని యూపీ పోలీసులకు తెలియజేస్తామన్నారు.