పోలీసులు కాల్పులు జరపలేదా ? ఇదిగో ప్రూఫ్ !

|

Dec 22, 2019 | 12:46 PM

సీఏఏ కు వ్యతిరేకంగా యూపీలో శనివారం అనేకచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించగా.. కొంతమంది గాయపడ్డారు. వీరిలో చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే తమ పోలీసులు అసలు బులెట్లనే ప్రయోగించలేదని, తూటా గాయాలవల్ల ఎవరూ మృతి చెందడం గానీ, గాయపడడం గానీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందిని వెనకేసుకొస్తున్నారు. కానీ.. అది నిజం కాదని, పోలీసోళ్ళు యధేచ్చగా నిరసనకారులపై కాల్పులు జరిపారనడానికి నిదర్శనంగా ఓ వీడియో బయటపడింది. […]

పోలీసులు కాల్పులు జరపలేదా ? ఇదిగో ప్రూఫ్ !
Follow us on

సీఏఏ కు వ్యతిరేకంగా యూపీలో శనివారం అనేకచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించగా.. కొంతమంది గాయపడ్డారు. వీరిలో చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే తమ పోలీసులు అసలు బులెట్లనే ప్రయోగించలేదని, తూటా గాయాలవల్ల ఎవరూ మృతి చెందడం గానీ, గాయపడడం గానీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందిని వెనకేసుకొస్తున్నారు.

కానీ.. అది నిజం కాదని, పోలీసోళ్ళు యధేచ్చగా నిరసనకారులపై కాల్పులు జరిపారనడానికి నిదర్శనంగా ఓ వీడియో బయటపడింది. కాన్పూర్  లో  సేఫ్టీ జాకెట్, తలకు హెల్మెట్ ధరించిన ఒక పోలీసు ఓ చేతిలో లాఠీ, మరో చేతిలో రివాల్వర్ పట్టుకుని వీధిలో ఒక మూలనుంచి మరో మూలకు దాదాపు పరుగులు తీస్తూ ఆందోళనకారులపై ఫైర్ చేయడం స్పష్టంగా కనిపించింది. యూపీలో రాష్ట్ర వ్యాప్తంగా 400 కు పైగా ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే నిరసనకారులు నాటు తుపాకులతో తమలో తాము కాల్పులు జరుపుకోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారని అంతే తప్ప మా పోలీసులు ఫైర్ చేయలేదని యూపీ ఐజీ ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. ఆ రాష్ట్ర డీజీపీ సింగ్ దీ అదే మాట ! అయితే తమపై రాళ్లు రువ్వుతున్న నిరసనకారులనుంచి తమను తాము రక్షించుకోవడానికే మేము ‘అలా చేశామని ‘ ఖాకీలు చెబుతున్నా.. ఈ వీడియోలో… వీరిపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులెవరూ కనబడలేదు.