అత్యంత సన్నిహితుడ్ని కోల్పోయా..రాజ్యసభలో వెంకయ్య కంట కన్నీరు

|

Jul 29, 2019 | 4:55 PM

తనకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. జైపాల్ రెడ్డి మృతికి సోమవారం సభలో సంతాప తీర్మానాన్ని చదువుతున్నప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. జైపాల్ ని ఆయన మంచి వక్త, పాలనా దక్షుడని పేర్కొన్నారు. .. 1970 ప్రాంతాల్లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తాము గడిపిన రోజులను తల్చుకున్నారు. జైపాల్, తాను ఒకే బెంచ్ మేట్స్ అని ఇదివరకే వెంకయ్య […]

అత్యంత సన్నిహితుడ్ని కోల్పోయా..రాజ్యసభలో వెంకయ్య కంట కన్నీరు
Follow us on

తనకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. జైపాల్ రెడ్డి మృతికి సోమవారం సభలో సంతాప తీర్మానాన్ని చదువుతున్నప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. జైపాల్ ని ఆయన మంచి వక్త, పాలనా దక్షుడని పేర్కొన్నారు. .. 1970 ప్రాంతాల్లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తాము గడిపిన రోజులను తల్చుకున్నారు. జైపాల్, తాను ఒకే బెంచ్ మేట్స్ అని ఇదివరకే వెంకయ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు ఉదయం 7 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసేవారమని, ఎన్నో రాజకీయ విశేషాలు చర్చించుకునేవారమని ఆయన గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డితో నాకు దాదాపు 40 ఏళ్ళ సాన్నిహిత్యం ఉంది. అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నా.. క్షమించండి అని వెంకయ్యనాయుడు సభ్యులతో అన్నారు. జైపాల్ కు ఉన్న విజ్ఞానం, భాషపై ఆయనకున్న పట్టు అపారమని,జైపాల్ కన్నా తాను ఆరేళ్ళు చిన్నవాడినని, తన సీనియర్ అయిన ఆయన.. ఎన్నో విషయాల్లో తనకు గైడ్ అని వెంకయ్య అన్నారు.