Floods jammu: జమ్మూ కశ్మీర్ కత్రాలో భారీ వరదలు.. నిలిచిన వైష్ణో దేవి తీర్థయాత్ర

|

Aug 20, 2022 | 7:19 AM

జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా పట్టణంలో శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో వరదలు సంభవించాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను..

Floods jammu: జమ్మూ కశ్మీర్  కత్రాలో భారీ వరదలు.. నిలిచిన వైష్ణో దేవి తీర్థయాత్ర
Floods Katra
Follow us on

Floods Jammu: జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా పట్టణంలో శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో వరదలు సంభవించాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కలికంగా నిలిపివేశారు. ఆలయంలోకి భక్తుల రాకపోకలను నిలిపివేశారు. కత్రా పట్టణంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కత్రా నుండి వైష్ణో దేవి ఆలయానికి భక్తుల తరలింపును నిలిపివేశారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రాణనష్టం జరగలేదని శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు వెల్లడించింది.

కత్రా పట్టణంతో పాటు.. వైష్ణోదేవి ఆలయం సమీపంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు మొహరించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భారీ వరదల కారణంగా రహదారులపై నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఏ ఒక్కరూ నడవడానికి వీలులేని పరిస్థితి ఉంది. దీంతో చుట్టుపక్కల యాత్రికులు ఎవరూ లేకుండా వారందరిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..