Vaccination: మే ఒకటి నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కరోనా టీకా

|

Apr 19, 2021 | 7:56 PM

మే 1 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైపడిన వారందరికీ కోవిడ్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Vaccination: మే ఒకటి నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కరోనా టీకా
VAccination
Follow us on

మే 1 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైపడిన వారందరికీ కోవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రెండో వేవ్ లో వేగంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన సమావేశంలో మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలో అందరికీ కరోనా టీకాను అందించాలని నిర్ణయించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.  ఏడాది కాలంగా అత్యధికమంది భారతీయులకు వ్యాక్సిన్‌ అందించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు.  వీలైనంత తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని అన్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలను టీకా ఉత్పత్తి విషయంలో మరింత ప్రోత్సహిస్తామని.. ఎక్కువ టీకాలు ఉత్పత్తి చేసే విధంగా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

 

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.