అన్ లాక్ ,4.0 . మెట్రో సర్వీసుల పునరుధ్దరణ ?

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2020 | 7:40 PM

సెప్టెంబరు 1 నుంచి అన్ లాక్ ,4.0 ప్రారంభం కాబోతున్న దృష్ట్యా, దేశవ్యాప్తంగా మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ త్వరలో..

అన్ లాక్ ,4.0 . మెట్రో సర్వీసుల పునరుధ్దరణ ?
Follow us on

సెప్టెంబరు 1 నుంచి అన్ లాక్ ,4.0 ప్రారంభం కాబోతున్న దృష్ట్యా, దేశవ్యాప్తంగా మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ త్వరలో గైడ్ లైన్స్ జారీ చేయనుంది. అయితే స్కూళ్ళు, కాలేజీలను ఇప్పట్లో ప్రారంభించే సూచనలు మాత్రం లేవు. మెట్రో సర్వీసులను పునరుధ్దరించాలని కేంద్రాన్ని కోరుతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్ననే పేర్కొన్నారు. కాగా.. బార్లను ఇప్పట్లో పునరుధ్దరించకపోయినప్పటికీ, వాటి కౌంటర్లలో అమ్మకాలు జరగవచ్చు.  మందు  ప్రియులు ఎంచక్కా మందు కొనుక్కుని తీసుకునిపోవచ్చు,. టేక్ ఎవే అన్న మాట !కానీ బార్లలో గ్లాసుల గల గలలు మాత్రం వినిపించవు.