రామాలయ నిర్మాణానికి 150 నదుల నుంచి జలం, ఇద్దరు బ్రదర్స్ దే ఘనత !

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2020 | 6:02 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 70 ఏళ్ళు పైబడిన ఇద్దరు సోదరులు నిరంతరం శ్రమించారు. 150 నదుల నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. రాధే శ్యామ్ పాండే, శబ్ద వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే వీరు 8 నదులు..

రామాలయ నిర్మాణానికి 150 నదుల నుంచి జలం, ఇద్దరు బ్రదర్స్ దే ఘనత !
Follow us on

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 70 ఏళ్ళు పైబడిన ఇద్దరు సోదరులు నిరంతరం శ్రమించారు. 150 నదుల నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. రాధే శ్యామ్ పాండే, శబ్ద వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే వీరు 8 నదులు, మూడు సముద్రాల నుంచి నీటిని,  శ్రీలంక లోని 16 స్థలాల నుంచి  మట్టిని కూడా సేకరించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని తాము తహతహలాడుతున్నామని వీరు పేర్కొన్నారు.  దేశ వ్యాప్తంగా గల నదుల నుంచి పవిత్ర జలాలను, శీలంకలోని పదహారు చోట్ల నుంచి మట్టిని సేకరించాలన్నది తమ లక్ష్యమని, ఇన్నేళ్లకు ఆలయ నిర్మాణానికి సంబంధించి తాము కన్న కలలు నిజం కాబోతున్నాయని రాధే శ్యామ్ అన్నారు. 1968 నుంచి 2019 వరకు కూడా తాము కాలినడకన,ఒక్కోసారి బైక్ పైన, మరికొన్నిసార్లు, రైలు, విమానాల ద్వారా ప్రయాణిస్తూ వచ్చామని ఆయన చెప్పారు. ఆగస్టు 5 న అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేయనున్నారు.