అహ్మదాబాద్‌లో ట్రంప్‌కి 70 లక్షల మందితో ఆహ్వానమా ? ‘నవ్విపోదురు’ ! ట్విటర్ యూజర్ల సెటైర్లు

| Edited By: Pardhasaradhi Peri

Feb 23, 2020 | 12:39 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో ఇండియాకు రానున్నారు. ఢిల్లీతో బాటు అహ్మదాబాద్ ను కూడా ఆయన సందర్శించనున్నారు. తనకు ఆ నగరంలో 70 లక్షలమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ చెప్పారని ఆయన సంబరంగా చెప్పుకుంటున్నారు.

అహ్మదాబాద్‌లో ట్రంప్‌కి 70 లక్షల మందితో ఆహ్వానమా ? నవ్విపోదురు ! ట్విటర్ యూజర్ల సెటైర్లు
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో ఇండియాకు రానున్నారు. ఢిల్లీతో బాటు అహ్మదాబాద్‌ను కూడా ఆయన సందర్శించనున్నారు. తనకు ఆ నగరంలో 70 లక్షలమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ చెప్పారని ఆయన సంబరంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సంఖ్యపై అప్పుడే ట్విటర్ యూజర్లు తలో రకంగా సెటైర్లు, జోకులు వేయడం ప్రారంభించారు. 2011 లో అహ్మదాబాద్ జనాభా సెన్సస్ లెక్కల ప్రకారం.. 55 లక్షలు.. ఈ ఏడాది లెక్కల ప్రకారం.. 86 లక్షలు.. మరి.. ఈ లెక్కన ఆయనకు 70 లక్షల మంది ఆహ్వానం పలుకుతారనడంలో ఏమైనా ఔచిత్యం ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలిది సాధ్యమా అని కొందరంటే.. మరికొందరు.. మోదీ అలా హామీ ఇచ్చారని.. అసలిది ఎంతవరకు నెరవేరుతుందో చూసేందుకు ‘తహతహలాడుతున్నామని’  సెటైర్లు వేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్…అభిశంసన వేటు నుంచి తప్పించుకుని వస్తున్న ట్రంప్ మహాశయుని రాకకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా అని ట్వీట్ చేశారు. ఈ దేశంలో పేదరికం తాండవిస్తోందని, ఈ సమయంలో ఈ సమస్యపై దృష్టి పెట్టే బదులు ఆడంబరాలకు పోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. మరికొంతమంది.. వెల్‌కమ్ చెప్పే జనాభా సంఖ్యను 70 లక్షల టన్నులతో పోల్చవచ్చునని అన్నారు. ఇలా వ్యంగ్యంగా అనేకమంది ట్రంప్ రాక పట్ల ఇండియా వైఖరిని పరిహాసం చేస్తూ ట్వీట్లు చేశారు.